
ఎర్రరాయితో మెథడిస్టు చర్చి..
ఎర్ర రాయితో అద్భుతంగా నిర్మించిన
మెథడిస్టు సెంట్రల్ చర్చి
జహీరాబాద్ టౌన్: జహీరాబాద్‌లో నిర్మించే ఇళ్లలో 90 శాతం ఎర్రరాయి కట్టడాలే. నవాబుల కాలం నాటి నుంచి నేటి వరకు స్థానికంగా లభించే ఎర్రరాయిని వినియోగిస్తారు. ఈ రాయితో పట్టణంలో మెథడిస్టు సెంట్రల్ చర్చిని అద్భుతంగా నిర్మించారు. చర్చి వ్యవస్థాపకుడు జాన్‌వెస్లీ ఆధ్వర్యంలో అన్న అరెల్ట్, డీబీ గార్డెన్, రూథ్ ప్యాటరైజ్ పట్టణంలోని అల్లీపూర్ ప్రాంతంలో 1931లో నిర్మాణానికి శ్రీకారం చుట్టి 1951లో పూర్తి చేశారు. శిలువ ఆకారంలో నిర్మించిన చర్చి ఇంజినీరింగ్ నైపుణ్యానికి అద్దం పడుతుంది. దీనికి దగ్గరలో నిర్మించిన పాఠశాల భవనం కూడా ఇప్పటికీ చెక్కు చెదరలేదు. తరగతి గదుల్లో గాలి, వెలుతురు ప్రవేశించే విధంగా నిర్మించారు.