
జాతీయ భావాన్ని పెంపొందించుకోవాలి
జహీరాబాద్: విద్యార్థులు జాతీయ భావాన్ని పెంపొందించుకుని దేశ భక్తులుగా ఉండాలని ఏబీవీపీ మెదక్ విభాగ్ సంఘటన మంత్రి బోడ లక్ష్మణ్ అన్నారు. ఆదివారం పట్టణంలోని సిద్ధార్థ పాఠశాలలో రెండు రోజుల శిక్షణ, వర్గ ముగింపు సమావేశంలో పాల్గొని మాట్లాడారు. వ్యక్తి నిర్మాణం ద్వారానే జాతి పునర్‌నిర్మాణం అవుతుందన్నారు. నగరాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి మార్గదర్శనం చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర ఇన్‌చార్జి మాసాడి బాపూరావు, ప్రాంత సహా సంఘటన కార్యదర్శి విష్ణువర్ధన్, ఉమ్మడి మెదక్ జిల్లా కార్యకర్తలు, పూర్వ కార్యకర్తలు పాల్గొన్నారు.