
పటిష్ట్టతకు అద్దం రంగంపేట కోట
కోట ముఖ ద్వారం
కొల్చారం(నర్సాపూర్): నిజాం కాలం నాటి హైదరాబాద్ రాజ్యంలో ఉన్నటువంటి 14 సంస్థానాల్లో పాపన్నపేట సంస్థానం ఒకటి. వారి కిందే కొనసాగింది నిజాం నవాబులచే రాయ్ భాగన్(ఆడ సింహం)గా బిరుదును పొందిన రాణి శంకరమ్మ. ఆమె దత్త పుత్రుడు సదాశివరెడ్డి చే 1700 సంవత్సరం మధ్యకాలంలో నిర్మించిందే రంగంపేట కోట. దాదాపు పదెకరాల విస్తీర్ణంలో నిర్మించాడు. చుట్టూ నాలుగు బురుజులు, రెండు ప్రధాన ద్వారాలు, రాణి మహల్, మెట్ల బావి, గురప్రు శాల, అంతర్గత డ్రైనేజీ నిర్మాణం, అద్దాల మేడ, గోడలపై నక శిల్పాలు ఇలా ఎన్నో ప్రస్తుతం కోటలో శిథిలావస్థకు చేరుకొని కనిపిస్తాయి. ఈ కోట బురుజు పైనుండి చూస్తే మెదక్ ఖిల్లా కనిపించడం విశేషం. నిర్మాణానికి రాయితోపాటు డంగు సున్నాన్ని వాడారు.