7,44,157 | - | Sakshi
Sakshi News home page

7,44,157

Sep 3 2025 7:56 AM | Updated on Sep 3 2025 7:56 AM

7,44,157

7,44,157

పంచాయతీ ఓటర్లు

తుది ఓటరు జాబితా విడుదల

తగ్గిన పంచాయతీలు, వార్డులు, ఓటర్లు

పంచాయతీ కార్యాలయాల్లోజాబితా ప్రదర్శన

మున్సిపాలిటీలలో విలీనంతో తగ్గింపు

జిల్లాలో పలు గ్రామ పంచాయతీలను సమీప మున్సిపాలిటీలలో విలీనం చేయటంతో పాటు కొత్తగా మున్సిపాలిటీలు ఏర్పడ్డాయి. గత ఏడాది సెప్టెంబరులో విడుదల చేసిన జాబితా కంటే ప్రస్తుతం విడుదల చేసిన జాబితా ప్రకారం 40 వేల వరకు ఓటర్లు తగ్గారు. గ్రామ పంచాయతీలు 20, వార్డులు 188 తగ్గాయి.

సంగారెడ్డి జోన్‌: రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అధికారులు కొత్త ఓటరు జాబితాతో పాటు పోలింగ్‌ స్టేషన్ల జాబితా సిద్ధం చేసి విడుదల చేశారు. ఈ మేరకు జిల్లాలో 7,44,157 మంది ఓటర్లు ఉండగా 5370 పోలింగ్‌ స్టేషన్లు ఉన్నాయి. అత్యధికంగా మహిళలు ఉన్నారు. గత నెల 26న పంచాయతీలలో వార్డుల వారీగా కొత్త ఓటరు జాబితాతో పాటు పోలింగ్‌ స్టేషన్లను గుర్తించి జాబితా తయారు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అధికారులు జాబితాలను సిద్ధం చేసి, ప్రచురించింది.

2010 అభ్యంతరాలు స్వీకరణ, పరిష్కారం

రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గత నెల 28న ముసాయిదా ఓటరు జాబితాతో పాటు పోలింగ్‌ స్టేషన్ల వివరాలు పంచాయతీల వారీగా ప్రకటించారు. 29, 30 తేదీలలో జిల్లా స్థాయితోపాటు మండల స్థాయిలో రాజకీయ పార్టీల నేతలతో ముసాయిదా జాబితాలపై సమీక్ష నిర్వహించారు. అదేవిధంగా 28 నుంచి 30 వరకు ముసాయిదా జాబితాలపై అభ్యంతరాలు స్వీకరించారు. ఈ మేరకు జిల్లాలో 2010 అభ్యంతరాలను స్వీకరించి, వాటిని పరిష్కరించి తుది ఓటరు జాబితాతో పాటు పోలింగ్‌ స్టేషన్ల జాబితాలను సిద్ధం చేశారు. మంగళవారం కలెక్టర్‌ ప్రావీణ్య ఆమోదంతో తుది జాబితాలను విడుదల చేశారు. గ్రామ పంచాయతీలలో పూర్తి వివరాలను ప్రచురించారు.

జిల్లాలోని ఓటర్ల వివరాలు

నియోజకవర్గం మహిళలు పురుషులు ఇతరులు పోలింగ్‌ స్టేషన్‌లు

అందోల్‌ 84548 81382 3 1252

నారాయణఖేడ్‌ 94347 95108 7 1628

నర్సాపూర్‌ 22051 20841 2 334

పటాన్‌చెరు 11227 10805 2 102

సంగారెడ్డి 68346 65367 28 810

జహీరాబాద్‌ 95324 94767 2 1244

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement