
యూరియా కోసం ఇక్కట్లు హత్నూర(సంగారెడ్డి): యూరియా కోసం రై
కవిత సస్పెన్షన్ సబబే..
● కేసీఆర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం
● ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్‌రావు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/జహీరాబాద్: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సస్పెండ్ చేస్తూ పార్టీ అధినేత కేసీఆర్ తీసుకున్న నిర్ణయం సబబేనని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు పేర్కొన్నారు. మంగళవారం వారు వేర్వేరుగా ప్రకటలు విడుదల చేశారు. కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా అది బీఆర్‌ఎస్ పార్టీకి, తెలంగాణ ప్రజల మేలు చేకూరే విధంగా ఉంటుందని చెప్పారు. కవితను బీఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ చేస్తూ అధినేత కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై వారు స్పందించారు. ఎంత మంది పార్టీకి ద్రోహం చేసినా బీఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల గుండెల్లో ఉంటుందని పేర్కొన్నారు. పార్టీని ఇబ్బందులు పెట్టాలని చూస్తే తన, పర భేదాలు లేకుండా క్రమశిక్షణ చర్యలు ఉంటాయని కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారని అన్నారు. కేసీఆర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఎమ్మెల్యేలు చింతా, మాణిక్‌రావు అన్నారు.

యూరియా కోసం ఇక్కట్లు హత్నూర(సంగారెడ్డి): యూరియా కోసం రై