
కేంద్రం ఆధీనంలోనే ఎరువుల తయారీ
అక్కన్నపేట(హుస్నాబాద్): ఎరువుల తయారీ.. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందని, మిగితా విత్తనాలు నీళ్లు, విద్యుత్‌ను రాష్ట్రాలు ఇస్తాయని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడికి ఎరువులు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదన్నారు. రాష్ట్రానికి ఎరువులు సరఫరా చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ అధ్యక్షుడు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలన్నారు. దమ్ముంటే ఢిల్లీకి వెళ్లి ప్రధాన మంత్రి దగ్గర కూర్చొని రైతులకు అవసరమైన ఎరువులు సరఫరా చేయించాలని డిమాండ్ చేశారు. పలుమార్లు సీఎం రేవంత్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి సంబంధిత కేంద్ర మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారన్నారు. కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కేంద్రంపై ఒత్తిడి తేవాలని మంత్రి పేర్కొన్నారు.
గ్రామాలను విలీనం చేసేందుకు ప్రయత్నం
మండలంలోని గోవర్ధనగిరి, రేగొండ గ్రామాలను హుస్నాబాద్‌లో విలీనం చేసేందుకు సీసీఎల్‌ఏలో ప్రయత్నిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మండల కేంద్రంలోని కేజీబీవీ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం రైతు వేదికలో రేషన్ కార్డులు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ హైమావతి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, ఆర్డీఓ రాంమ్మూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, నాయకులు పాల్గొన్నారు.
ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్థలం పరిశీలన
కోహెడరూరల్(హుస్నాబాద్): యంగ్ ఇండియా స్కూల్‌తో విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్య అందనుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ సందర్భంగా మండలంలోని తంగలపల్లిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ స్థలాన్ని పరిశీలించారు. నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని సూచించారు. అనంతరం బస్వాపూర్, పోరెడ్డిపల్లెలో ఈత మొక్కలు నాటారు. ప్రభుత్వ స్థలాలు, చెక్‌డ్యాంలు, చెరువు కట్టల వద్ద మొక్కలు నాటాలన్నారు. మంత్రి వెంట కలెక్టర్ , అధికారులు ఉన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసే కుట్ర
రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్