
వన దుర్గమ్మా.. కరుణించమ్మా
పాపన్నపేట(మెదక్): వన దుర్గమ్మా.. మము బ్రోవమ్మా అంటూ వేలాది మంది భక్తులు ఆదివారం అమ్మవారిని దర్శించుకున్నారు. ఉదయం నుంచే ఆలయం వద్ద రద్దీ నెలకొంది. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఒడిబియ్యం పోసి బోనాలు తీసి మొక్కు చెల్లించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఆలయ సిబ్బంది, పోలీసులు చర్యలు తీసుకున్నారు.
వీహెచ్‌పీ జిల్లా
ఉపాధ్యక్షుడిగా రవి
పటాన్‌చెరు టౌన్: విశ్వహిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షుడిగా పటాన్‌చెరు డివిజన్‌కు చెందిన రవి ఎన్నికయ్యారు. ఈ మేరకు వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనారాయణ ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. తన నియామకానికి సహకరించిన నాయకులందరికీ రవి కృతజ్ఞతలు తెలిపారు. వీహెచ్‌పీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.
మోదీ విధానాలపై
పోరాడాలి
ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్
సంగారెడ్డి ఎడ్యుకేషన్: ప్రధాని మోదీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్ పేర్కొన్నారు. సంగారెడ్డిలోని టీఎన్‌జీఓ భవన్‌లో ఆదివారం జరిగిన ఏఐటీయూసీ రాష్ట్ర నాలుగవ మహాసభకు ఆయన హాజరై మాట్లాడారు. కార్మికులకు మద్దతుగా లేబర్ కోడ్‌లను రద్దు చేసే వరకు నిరంతరం పోరాడతామన్నారు. కార్మికులు నిరంతరం పనిచేస్తున్న పని భద్రత ప్రదేశాల్లో భద్రత కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. యాజమాన్యం కార్మికుల దోపిడీకి పాల్పడుతుందని మండిపడ్డారు.
బీసీలకే 42% రిజర్వేషన్లు
నర్సాపూర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా 42% రిజర్వేషన్లు బీసీలకే ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మురళీయాదవ్, పార్టీ ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేశ్‌గౌడ్ డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక విలేకరులతో వారు మాట్లాడుతూ...ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి అందులో ముస్లింలకు పది శాతం ఇవ్వడమెందుకని ప్రశ్నించారు. బీసీల రిజర్వేషన్లలో ముస్లింలకు ఇస్తే బీసీలను మోసం చేయడమేనని వారన్నారు. 42% రిజర్వేషన్లను బీసీలకే ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. కాగా, మొదటగా రాష్ట్ర మంత్రి మండలిలో బీసీల సంఖ్యను పెంచాలని మురళీయాదవ్, రమేశ్‌గౌడ్‌లు డిమాండ్ చేశారు. కాగా సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికలు పెట్టనందున నిధులు రావడం లేదని, సీఎం పరోక్షంగా గ్రామాల అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

వన దుర్గమ్మా.. కరుణించమ్మా

వన దుర్గమ్మా.. కరుణించమ్మా