
ప్రశాంతంగా జీపీఓ, సర్వేయర్ల పరీక్ష
సంగారెడ్డి జోన్: గ్రామ పాలన అధికారులు (జీపీఓ), లైసెన్స్‌డ్ సర్వేయర్ల నియామకం కోసం నిర్వహించిన అర్హత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఆదివారం పట్టణంలోని ప్రభుత్వ తారా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ పి.ప్రావీణ్య, అధికారులతో కలిసి పరిశీలించారు. ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు నిర్వహించిన గ్రామ పాలన అధికారి పరీక్షకు 77 మంది అభ్యర్థులకు గాను 62 మంది హాజరు కాగా, 15 మంది గైర్హాజరయ్యారు. లైసెన్స్‌డ్ సర్వేయర్ల పరీక్షకు ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు జరిగిన థియరీ పరీక్షకు160 మంది అభ్యర్థులకు గాను 129 మంది హాజరు కాగా 31 మంది గైర్హాజరయ్యారు. అదేవిధంగా మధ్యాహ్నం సర్వేయర్ల అభ్యర్థులకు మధ్యాహ్నం 2.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు నిర్వహించారు. కలెక్టర్‌తోపాటు అదనపు కలెక్టర్ మాధురి, డీఆర్‌ఓ పద్మజారాణి, జెడ్పీ సీఈఓ జానకిరెడ్డి, సహాయ సంచాలకులు సర్వే ల్యాండ్ రికార్డు అధికారి ఐనేష్, ఆర్డీవో రవీందర్‌రెడ్డి, పరీక్ష కేంద్రం చీఫ్ సూపర్డెంట్, అధికారులు పాల్గొన్నారు.
పరీక్షా కేంద్రాన్ని సందర్శించిన
కలెక్టర్ ప్రావీణ్య