రైతులకు గుర్తింపు కార్డు తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

రైతులకు గుర్తింపు కార్డు తప్పనిసరి

Jul 10 2025 8:22 AM | Updated on Jul 10 2025 8:22 AM

రైతులకు గుర్తింపు కార్డు తప్పనిసరి

రైతులకు గుర్తింపు కార్డు తప్పనిసరి

సంగారెడ్డి టౌన్‌ : రైతులందరూ తప్పనిసరిగా ఫార్మర్‌ రిజిస్ట్రీలో నమోదు చేసుకుని గుర్తింపుకార్డులు పొందాలని మండల వ్యవసాయ శాఖ అధికారి ఝాన్సీ సూచించారు. సంగారెడ్డి మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం ఫార్మర్‌ రిజిస్ట్రీ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..రైతు కార్డు నమోదు అనేది రైతులందరికీ ముఖ్యమైనదని దీని ద్వారా ప్రభుత్వ పథకాలు, రాయితీలను పొందేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసుకోవాలని పూర్తి వివరాలను అందజేయాలన్నా రు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు,రైతులు తదితరులు పాల్గొన్నారు.

అండగా ఉంటాం..

ధైర్యంగా ఉండండి

మునిపల్లి(అందోల్‌): అండగా ఉంటాం ధైర్యంగా ఉండాలని రాజనర్సింహ్మ ఫౌండేషన్‌న్‌ చైర్మన్‌ శిలాపూర్‌ త్రిష మణికంఠ బాధిత కుటుంలబానికి భరోసా కల్పించారు. బుధవారం సంగారెడ్డిలో మంత్రి దామోదర క్యాంపు కార్యాలయంలో మండలంలోని పెద్దచల్మెడ గ్రామానికి చెందిన చాకలి దుర్గయ్య, కంకోల్‌ గ్రామానికి చెందిన రషిద్‌ కుతూరు పెళ్లికి రాజనర్సింహ్మ పౌండేషన్‌ ద్వారా ఆర్థిక సహాయం అందజేశారు. కంకోల్‌ గ్రామానికి చెందిన ఎండీ రషీద్‌ నాలుగేళ్ల క్రితం పాము కాటుతో మృతి చెందాడు. దీంతో రషిద్‌ కూతురు వివాహానికి ఆర్థిక సహాయం అందజేశారు. పెద్దచల్మెడ గ్రామానికి చెందిన చాకలి దుర్గయ్య యాక్సిడెంట్‌లో మృతి చెందాడు. వారికి కూడా రాజనర్సింహ్మ ఫౌండేషన్‌ ద్వారా ఆర్థిక సహాయం అందజేశారు.

కార్మిక సంఘం ఎన్నికల్లోఇండిపెండెంట్‌ గెలుపు

జహీరాబాద్‌ టౌన్‌: జహీరాబాద్‌ సమీపంలోని ముంగి ఇంజనీరింగ్‌ పరిశ్రమలో బుధవారం జరిగిన కార్మిక సంఘం ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి గోవర్థన్‌ భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో బీఎంఎస్‌ అభ్యర్థిగా మల్లేశం, స్వతంత్ర అభ్యర్థిగా గోవర్ధన్‌లు పోటీ చేశారు. 63 ఓట్లు పోల్‌ అవ్వగా గోవర్థన్‌కు 47, మల్లేశంకు 15 ఓట్లు పడ్డాయి. 32 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. దీంతో ఆయన మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు.

ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలి

రాయికోడ్‌(అందోల్‌): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతంగా కొనసాగేలా చూడాలని ఎంపీడీఓ ఎంఎం.షరీఫ్‌ పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. మండలంలోని హస్నాబాద్‌, సంగాపూర్‌ గ్రామాలను సందర్శించారు. జాతీయ ఉపాధిహామీ పనులను, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలానికి 414 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా 145 ఇళ్ల నిర్మాణ పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయన్నారు. 17 మంది లబ్ధిదారులకు మొదటి విడతలో భాగంగా రూ.లక్ష బిల్లు చెల్లించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది ఉన్నారు.

తహసీల్దార్‌గా చంద్రశేఖర్‌ బాధ్యతల స్వీకరణ

వట్‌పల్లి(అందోల్‌): వట్‌పల్లి మండల తహసీల్దార్‌గా చంద్రశేఖర్‌ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన ఎం. శ్రీనివాస్‌ జీహెచ్‌ఎంసీ ఎలక్షన్‌ బ్రాంచికి బదిలీ అయ్యారు. ఇక్కడే డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్న చంద్రశేఖర్‌కు తహసీల్దార్‌గా బాధ్యతలు అప్పగించారు. అనంతరం విధుల్లో చేరిన చంద్రశేఖర్‌ను రెవెన్యూ సిబ్బంది ఘనంగా సన్మానించారు. బదిలీపై వెళ్తున్న శ్రీనివాస్‌ను సన్మానించి వీడ్కోలు పలికారు.

సమస్యల పరిష్కారానికి కృషి

జిన్నారం (పటాన్‌చెరు): గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, కాలనీలను మున్సిపల్‌ కమిషనర్‌ దశరథ్‌ బుధవారం తనిఖీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో కొసాగుతున్న డిజిటల్‌ బోధన పద్ధతులను పర్యవేక్షించారు. కార్యలయ సిబ్బది, ఉపాధ్యాయులు, స్థానికులు పాల్గొన్నారు.

నూతన కార్యవర్గం ఎన్నిక

అమీన్‌పూర్‌ (పటాన్‌చెరు): కాలనీ ఫేజ్‌ 1లోని హ్యాపీ ఫెదర్స్‌ హౌసింగ్‌ వెల్ఫేర్‌ సొసైటీ కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. 2023–2025 కాలపరిమితిని పూర్తి చేసుకున్న పాత కార్యవర్గానికి అభినందనలు తెలుపుతూ 2025–2027 కాలానికి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు అజయ్‌ ఒరుగంటి, ఉపాధ్యక్షుడు శేఖర్‌ రెడ్డి జక్కిరెడ్డి, సాధారణ కార్యదర్శి శివ కృష్ణ రాంధి, సహాయ కార్యదర్శి , సందీప్‌ చింతల, ఖజానాదారు వంశీ మోరిశెట్టి, కార్యవర్గ సభ్యులు వెంకట్‌ రాంరెడ్డి బుషిరెడ్డి, శ్రీకాంత్‌ బయర్గోని, మురళీ కృష్ణ లింగంపల్లి, నాగేశ్వర్‌రావు సానబోయిన, సర్కార్‌ శ్రీనివాసులు చొక్కారి, వీరా రెడ్డి కొండేటిలను ఎన్నుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement