
పక్కాగా సాగు లెక్క!
పంట ఎకరాలు
సోయాబీన్ 46,689
కంది 44,755
చెరుకు 8,973
పెసర 8,354
మొక్కజొన్న 8,459
మినుము 4,820
జనుము 5,006
జీలుగు 19,525
● జిల్లాలో పత్తి 3,16,171 ఎకరాలు
● గ్రామాల వారీగా పంట నమోదు
● ప్రతీ పంట ఆన్‌లైన్‌లో అప్‌లోడ్
మునిపల్లి(అందోల్): రైతులు ఖరీఫ్ సీజన్‌లో ఏ పంట ఎంత సాగు చేస్తున్నారనే వివరాలను సంబంధిత జిల్లా అధికారుల లెక్కలు చెబుతున్నాయి. 2025 జూలై 6 వరకు ఆయా గ్రామాల్లో పంటల సాగుకు సంబంఽధించి వివరాలను సంబంధిత అధికారుల లెక్కల ప్రకారం.
వివరాల నమోదు
● గ్రామాల వారీగా రైతులు ఏ పంట ఎన్ని రకాలలో సాగు చేస్తున్నారు? రైతుల భూములకు సంబంధించి ఏ సర్వే నంబర్‌లో? ఎన్ని ఎకరాలలో ఏ పంట వేశారనే వివరాలు వ్యవసాయ విస్తరణ అధికారుల దగ్గర తప్పని సరిగా నమోదు చేయించాలి.
● పండించిన పంటను అమ్ముకోవడనికి సౌకర్యంగా ఉండేందు కోసం ప్రతీ పంటను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసే కార్యక్రమంను వ్యవసాయ విస్తరణ అధికారులు నిర్వహించాల్సి ఉంటుంది.
● జిల్లాలో ఎక్కువగా రైతులు పత్తి పంటను సాగు చేస్తున్నారు. మొదటి స్థానంలో పత్తి, రెండవ స్థానంలో సోయాబీన్ మూడవ స్థానంలో కంది సాగు చేస్తున్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. పత్తి పంటకు అంతర్జాతీయ స్థాయి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉండడంతో రైతులు ఎక్కువగా పత్తి పంట సాగుపైనే దృష్టి సారిస్తున్నారు. 4,29,965 ఎకరాలలో ఖరీఫ్ పంట సాగు చేసినట్లు సంబంధిత అధికారుల లెక్కలు చెబుతున్నాయి. (రబీ) మిగతా పంట సాగు కోసం 2,92, 955 ఎకరాలున్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి.