
ఎల్‌ఐసీ ఉద్యోగుల ధర్నా
జహీరాబాద్ టౌన్: ఎల్‌ఐసీ జహీరాబాద్ శాఖ ఉద్యోగులు బుధవారం కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. దేశంలోని ప్రభుత్వ ఉద్యోగులు, కార్మిక హక్కులు కాలరాసే చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి అశోక్ మాట్లాడుతూ పాలసీదారులు చెల్లిస్తున్న ప్రీమియంపై జీఎస్‌టీ రద్ద చేయాలని, క్లాస్ 3, 4 ఉద్యోగాల నియామకాలు చేపట్టాలని, కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో ఎల్‌ఐసీ ఉద్యోగులు, ఏజెంట్లు పాల్గొన్నారు.