
గుమ్మడిదల రైతులకు అండగా ఉంటా
జిన్నారం(పటాన్‌చెరు): గుమ్మడిదల రైతులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్ 109 భూ బాధితులు బుధవారం ఎమ్మెల్యేను క్యాంపు కార్యాలయంలో సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్ గోవర్ధన్‌రెడ్డితో కలిసి సమస్యను వివరించారు. పరిశ్రమల ఏర్పాటుకు భూములు కోల్పోతున్న రైతులు తగిన పరిహారం అందించేందుకు కృషి చేయాలని ఆయనను కోరారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో చర్చించి న్యాయపరమైన పరిహారం అందే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ కుమార్ గౌడ్, మద్దుల బాల్‌రెడ్డి, దేవేందర్‌రెడ్డి, సత్యనారాయణ, వాసుదేవరెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి