
వృక్ష ప్రేమికుడు విశ్వమోహన్ కన్నుమూత
జహీరాబాద్: నాలుగు దశాబ్దాలపాటు సర్పంచ్‌గా పని చేసిన కాలంలో రహదారికి ఇరువైపులా చెట్లు పెంచి వృక్ష ప్రేమికుడిగా ప్రశంసలందుకున్న విశ్వమోహన్(88) సోమవారం అనారోగ్యంతో కన్నుమూశారు. కోహీర్ మండలంలోని గొటిగార్‌పల్లి గ్రామ సర్పంచ్‌గా పనిచేసిన ఆయన పలుమార్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నాలుగు దశాబ్దాల పాటు సర్పంచ్‌గా కొనసాగిన ఆయన తాండూర్ క్రాస్ రోడ్డు నుంచి గొటిగార్‌పల్లి గ్రామం వరకు మూడు కిలోమీటర్ల పొడువు ఉన్న రహదారికిరు వైపులా మొక్కలు నాటించారు. అవిప్పుడు మహా వృక్షాలయ్యాయి.