రెండు నెలల క్రితమే లవ్‌ మ్యారేజ్‌.. పాశమైలారం ఘటనలో దంపతుల మృతి | Newly Love Married Couple Lives End In Pashamylaram Incident | Sakshi
Sakshi News home page

రెండు నెలల క్రితమే లవ్‌ మ్యారేజ్‌.. పాశమైలారం ఘటనలో దంపతుల మృతి

Jul 1 2025 1:54 PM | Updated on Jul 1 2025 4:14 PM

Newly Love Married Couple Lives End In Pashamylaram Incident

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా​: సంగారెడ్డి జిల్లా పాశమైలారం ఘటన పలు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. ప్రమాద సమయంలో కంపెనీలో పనిచేస్తోన్న జమ్మలమడుగుకు చెందిన నిఖిల్‌రెడ్డి, శ్రీరమ్య ఆచూకీ గల్లంతైంది. నిఖిల్‌రెడ్డి ఇటీవలే ముద్దనూరు మండలం పెనికలపాడుకు చెందిన నామాల శ్రీరమ్యను ప్రేమ వివాహం చేసుకున్నారు.

ఈ ఆషాఢ మాసం తర్వాత పెద్దల సమక్షంలో ఘనంగా వేడుక నిర్వహించడానికి నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో సోమవారం సిగాచీ పరిశ్రమలో జరిగిన దుర్ఘటనలో ఆ దంపతులు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. ఇరు కుటుంబాల వారు శోక సంద్రంలో మునిగిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement