దిద్దుబాటేది? | - | Sakshi
Sakshi News home page

దిద్దుబాటేది?

Jul 1 2025 7:33 AM | Updated on Jul 1 2025 7:33 AM

దిద్ద

దిద్దుబాటేది?

పారిశ్రామికవాడల్లో ప్రమాదాలు అరికట్టే చర్యలు శూన్యం

పటాన్‌చెరు: మనం అనుకోకుండా జరిగేవే ప్రమాదాలు..జీవితంలో ఎదురైన అనుభవాలు, ప్రమాదాల నుంచి మనం ఏదోక గుణపాఠం నేర్చుకుంటుంటాం. అయితే పటాన్‌చెరు పారిశ్రామిక వాడలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నా పరిశ్రమల యాజమాన్యాలు గుణపాఠం నేర్వడం లేదు. పాశమైలారంలో సిగాచీ పరిశ్రమలో సోమవారం జరిగిన ప్రమాదంలో శ్రమజీవులు పిట్టల్లా రాలి పోయిన ఘటనే అందుకు నిదర్శనం.

కార్మికులంతా ఔట్‌సోర్సింగే...

సిగాచీలో కార్మికులందరూ ఔట్‌సోర్సింగ్‌ వారే కావడం విశేషం. కార్మికులకు తాము చేస్తున్న పనికి వేతనం వస్తే చాలనే పరిస్థితి నెలకొంది. బిహార్‌, ఒడిశా రాష్ట్రాల నుంచి కార్మికులను తెచ్చి ఇక్కడ పరిశ్రమల్లో పని చేయిస్తున్నారు. ప్రమాదకర యంత్రాలపై ఏమాత్రం నైపుణ్యంలేని అన్‌స్కిల్డ్‌ లేబర్‌తో పని చేయిస్తున్నారు. అదేమంటే నిపుణుల కొరత ఉందని స్థానికులెవరూ పరిశ్రమల్లో పని చేసేందుకు ముందుకు రావడం లేదని పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు. కారణాలు ఏమైనా పరిశ్రమల్లో పని చేస్తున్న కార్మికుల వివరాలేవీ ప్రభుత్వ యంత్రాంగం వద్ద ఉండటం లేదు. ఒకవేళ ఉన్నప్పటికీ అవన్నీ తప్పుడు నివేదికలే అయి ఉంటున్నాయి. అధికారుల తనిఖీలు కూడా సరిగ్గా చేయడం లేదని తెలుస్తోంది.

గతంలో జరిగిన ప్రమాదాలివే..

ఇదే పరిశ్రమలో 2002లో ప్రమాదం జరిగింది. అప్పుడు ఒకరు మృతి చెందారు. తర్వాత ఏరిస్‌లో భారీ ప్రమాదం జరిగి కార్మికులు మృతి చెందారు. పాశమైలారంలో చైతన్య క్లోరైడ్స్‌, రాంటస్‌ పరిశ్రమలో భారీ ప్రమాదాలు జరిగాయి. రాంటస్‌లో జరిగిన ప్రమాదంలో మంటలార్పిన మూడు రోజులకు ముగ్గురు కార్మికుల మృతదేహాలు పూర్తిగా కాలిపోయి కనిపించాయి. ఇక జయవిజయ అల్లాయిస్‌ పరిశ్రమలో జరిగిన పేలుడు ప్రమాదంలో అక్కడికక్కడే ఆరు మంది కార్మికులు చనిపోయారు. వీరుపాక్ష రసాయన పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి చెందారు. 2023లో గడ్డ పోతారంలో మైలాన్‌ పరిశ్రమలో రసాయన డ్రమ్ములు పేలిన ఘటనలో ముగ్గురు కార్మికులు చనిపోయారు. తర్వాత లీ ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. ఈ ఏడాదిలోనే పాశమైలారం ఎంఎస్‌ఎన్‌లో ప్రమాదం జరిగింది. ఇలా ప్రతీసారి ఏదో ఒక పరిశ్రమలో ఏదో ఒక ప్రమాదం కార్మికులను పొట్టనబెట్టుకుంటోంది. కొన్ని పరిశ్రమల్లో అయితే జరిగిన ప్రమాదాలు సైతం వెలుగులోకి రావడం లేదు. చనిపోయిన వారి కుటుంబసభ్యులు కూడా ఇక్కడ అందుబాటులో ఉండకపోవడంతో పరిశ్రమల యాజమాన్యానికి కలిసివస్తోంది. మృతుల కుటుంబాలకు సదరు కాంట్రాక్టర్‌ ద్వారా ఎంతోకొంత సొమ్మును ముట్టజెప్పి వారి నోళ్లను నొక్కేస్తున్న ఘటనలు కోకొల్లలు.

దిద్దుబాటేది?1
1/2

దిద్దుబాటేది?

దిద్దుబాటేది?2
2/2

దిద్దుబాటేది?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement