
సెల్ఫీ తీసుకుంటూ ఆత్మహత్యాయత్నం
శివ్వంపేట(నర్సాపూర్) : వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మండల పరిధిలో చోటుచేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం... శభాష్ పల్లి గ్రామానికి చెందిన పానగారి సుధాకర్(28) ఆదివారం భార్యాపిల్లలను కొత్తపేట గ్రామంలో అత్తగారి ఇంటి వద్ద దింపాడు. అక్కడి నుంచి బైక్‌పై నర్సాపూర్‌కు వెళ్లి ఓ ఫర్టిలైజర్ దుకాణంలో పురుగుల మందు కొనుగోలు చేశాడు. రుస్తుంపేట గ్రామ శివారులో పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. నేను తప్పు చేయలేదు నా పిల్లలు దూరమవుతున్నారంటూ సెల్ఫీ వీడియోను తన స్నేహితుడికి వాట్సప్ చేశాడు. అతడు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. శివ్వంపేట పోలీసుల సహకారంతో లొకేషన్ ఆధారంగా కుటుంబ సభ్యులు వెళ్లేలోపు గుర్తించిన స్థానికులు సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇది ఇలా ఉండగా సుధాకర్ నాలుగేళ్ల క్రితం గ్రామంలో జరిగిన పోక్సో కేసులో నిందితుడిగా ఉన్నాడు. కేసు ట్రయల్‌కు రావడంతో శిక్ష పడుతుందన్న ఉద్దేశంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తుంది.