
వేర్వేరు చోట్ల ఇద్దరు అదృశ్యం
జహీరాబాద్: వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఈఘటన మండలంలోని రంజోల్ గ్రామంలో చోటు చేసుకుంది. రూరల్ పోలీసుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన గుండారెడ్డి(30) జూన్ 18న ఉదయం కారు డ్రైవింగ్‌కు వెళుతున్నట్లు ఇంట్లో చెప్పి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. బంధువులు, స్నేహితుల వద్ద కుటుంబ సభ్యులు వెతికినా ఎలాంటి ఆచూకీ లభించలేదు. సోమవారం అతడి అన్న శ్రీనివాస్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
నర్సాపూర్ పట్టణంలో వృద్ధుడు
నర్సాపూర్ రూరల్: వృద్ధుడు అదృశ్యమైన ఘటన నర్సాపూర్ పట్టణంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై లింగం వివరాల ప్రకారం... పట్టణంలోని సునీతా రెడ్డి కాలనీకి చెందిన ఎర్రోళ్ల మల్లయ్య (75) అనే వృద్ధుడు ఈ నెల 27న రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లి కనిపించకుండా పోయాడు. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. మల్లయ్య కుమారుడు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.

వేర్వేరు చోట్ల ఇద్దరు అదృశ్యం