
భవనం పైనుంచిపడి మేరిస్తీ మృతి
శివ్వంపేట(నర్సాపూర్): ప్రమాదవశాత్తు బిల్డింగ్ పైనుంచి కింద పడి తాపీ మేరిస్తీ మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... మాసాయిపేటకు చెందిన కండ్లకోయ ఆనంద్(22) తాపీ పని చేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. ఈ క్రమంలో మండల పరిధిలోని శభాష్‌పల్లి గ్రామంలో శనివారం భవన నిర్మాణ పనులు చేస్తుండగా కిందపడటంతో తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించగా ఆదివారం మృతిచెందాడు. మృతుడు తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ మధుకర్‌రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
చోరీకి పాల్పడిన
వ్యక్తికి దేహశుద్ధి
శివ్వంపేట(నర్సాపూర్): చోరీకి పాల్పడిన వ్యక్తికి గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. ఈ ఘటన మండల పరిధిలోని మగ్దుంపూర్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ప్రశాంత్ ఆదివారం తెల్లవారుజామున ఇండ్ల ముందు నల్లాలకు బిగించిన మోటార్లతో పాటు కేబుల్ వైర్ల చోరీకి పాల్పడుతుండగా గ్రామస్తులు పట్టుకున్నారు. దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ధరిపల్లిలో ట్రాన్స్‌ఫార్మర్ దగ్ధం
చిన్నశంకరంపేట(మెదక్): విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ దగ్ధమైన ఘటన మండలంలోని ధరిపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది.వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలో ఈదురుగాలులు వీచడంతో పాటు స్వల్ప వర్షం మొదలైన కొద్దిసేపటికే ట్రాన్స్‌ఫార్మర్‌లో మంటలు ఎగిసిపడ్డాయని స్థానికులు తెలిపారు. సమీప నివాస గృహాల్లోని ప్రజలు ఆందోళనకు గురయ్యారు. గ్రామస్తులు అప్రమత్తమై వెంటనే విద్యుత్ సబ్‌స్టేషన్‌కు సమాచారం అందించడంలో సరాఫరాను నిలిపివేశారు. దీంతో తృటిలో ప్రమాదం తప్పింది. ఈ విషయంపై ట్రాన్స్‌కో ఏఈ దినకర్ మాట్లాడుతూ ప్రమాదవశాత్తు ట్రాన్స్‌ఫార్మర్ దగ్ధమైందని, సరఫరాకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
నాయీ బ్రాహ్మణులు
సంఘటితం కావాలి
సంగారెడ్డి: నాయీ బ్రాహ్మణులు సంఘటితమై ఉన్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవాలని యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు కూన వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. ఆదివారం సంగారెడ్డి పట్టణంలోని భారతీయ విద్యా మందిర్ స్కూలులో నాయీ బ్రాహ్మణ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాచీన కాలం నుంచి అందరికీ ఆరోగ్యం, సౌందర్యాన్ని అందించిన ఘనత నాయీ బ్రాహ్మణులకు దక్కుతుందని గుర్తు చేశారు. అనంతరం నాయీ బ్రాహ్మణ ఉద్యోగుల సంఘం నాయకులు మాట్లాడుతూ.. సమాజంలో విషయ పరిజ్ఞానం కలిగినవాడు నాయీ బ్రాహ్మణుడని అన్నారు. సుకుమార్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఉద్యోగ సంఘం నాయకులు నాగభూషణం, దత్తాత్రి, సత్యం, రాజారాం, కిరణ్, నర్సిహులు, రామ్ కిషన్, పట్టణ అధ్యక్షుడు మాణిక్ ప్రభు, వర్కింగ్ ప్రెసిడెంట్ సాయినాథ్, కార్యదర్శి శ్రీశైలం, యువత కార్య దర్శి రాము, ఉపాధ్యక్షులు అనిల్ పాల్గొన్నారు.

భవనం పైనుంచిపడి మేరిస్తీ మృతి

భవనం పైనుంచిపడి మేరిస్తీ మృతి