
నారాయణఖేడ్ కోసం ఎంపీ, ఎమ్మెల్యే ప్రయత్నాలు
మారుమూల ఖేడ్ నియోజకవర్గంలో నవోదయ విద్యాలయం ఏర్పాటు చేస్తే మారుమూల పేద విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుందని జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డిలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే ఈ విషయంపై సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, జిల్లా మంత్రి దామోదరలను సైతం కలిసి ఖేడ్‌లో ఏర్పాటు చేయాలని కోరారు. కాగా జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ కేంద్ర విద్యాశాఖ మంత్రి జయంత్ చౌదరిని కలిసి జిల్లాకు మంజూరైన నవోదయ విద్యాలయం మారుమూలన కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఖేడ్‌లో ఏర్పాటు చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందని కోరారు. అందుకు అనువైన స్థలం కూడా ఉన్నట్లు వివరించారు. అందుకు మంత్రి సైతం సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ వెల్లడించారు. ఖేడ్ ఆర్డీఓ అశోక చక్రవర్తి, రెవెన్యూ అధికారులు ఖేడ్ నియోజకవర్గంలోని నిజాంపేట్– బాచేపల్లి గ్రామాల మధ్య జాతీయ రహదారిపై ఉన్న 30 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. నవోదయ పాఠశాల ఏర్పాటుకు ఈ భూమి అనుకూలంగా ఉన్నట్లు అధికారులు నివేదిక సమర్పించారు.