
మెరుగుబడినాయ్..
‘మన్ కీ బాత్’ వీక్షించిన మాజీ ఎంపీ బీబీపాటిల్
బీజేపీతోనే అభివృద్ధి
రామచంద్రాపురం(పటాన్‌చెరు): బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి పేర్కొన్నారు. రామచంద్రాపురం పట్టణంలో ఆదివారం ప్రధాని మోదీ నిర్వహించే ‘మన్ కీ బాత్’కార్యక్రమాన్ని కార్యకర్తలతో కలసి ఆమె వీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ప్రధాని మోదీ ఆధ్వర్యంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఎప్పటికప్పడు ప్రజల్లోకి తీసుకెళ్లి వివరిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు వెంకట్‌రెడ్డి, మల్లేశ్, కిష్టన్న, లక్ష్మణ్‌గౌడ్, కృష్ణమూర్తి, శేఖర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
జహీరాబాద్ టౌన్: ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని మాజీ ఎంపీ. బీబీపాటిల్ పార్టీ నాయకులతో కలిసి వీక్షించారు. జహీరాబాద్ పట్టణంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో 200 బూత్ లో ‘మన్ కీ బాత్’ను చూశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘మన్ కీ బాత్’ద్వారా ప్రధా ని మోదీ అనేక విషయాలను ప్రజల్లోకి తీసు కెళ్లుతున్నారని చెప్పారు.
మహిళా శక్తికి మోదీ కితాబు
నారాయణఖేడ్: ‘మన్ కీబాత్’ కార్యక్రమంలో తెలంగాణ మహిళా శక్తికి ప్రధాని మోదీ ప్రత్యేక కితాబునిచ్చారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జన్‌వాడే సంగప్ప తెలిపారు. ‘మన్‌కీ బాత్’123వ ఎపిసోడ్‌ను ఖేడ్‌లో ఆయన కార్యకర్తలతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భద్రాచలంలో మహిళాగ్రూపు మిల్లెట్ బిస్కెట్ల తయారీ గురించి ప్రస్తావించారన్నారు.