
గంగమ్మకు ప్రత్యేక పూజలు
మునిపల్లి(అందోల్): వర్షాలు పడాలని సింగూర్ ప్రాజెక్టు సమీపంలో గ్రామస్తులంతా కలిసి గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం మండలంలోని బుస్సారెడ్డిపల్లి గ్రామస్తులు వర్షాలు పడాలని గ్రామంలో ఆయా దేవాలయాల్లో దేవతలకు, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు పెట్టారు. పంటలు మొలకెత్తి రోజులు గడుస్తున్నా వర్షాలు పడక పోవడంతో రైతులు ఆందోళన చెందిన గ్రామంలో దేవతలకు ప్రత్యేక పూజలు చేయడం ప్రారంభించారు. గంగమ్మకు నైవేద్యం పెట్టి గ్రామస్తులంతా అక్కడే భోజనం చేశారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు.
వానలు కురిపించు బీరప్పా!
నారాయణఖేడ్: వర్షాలు కురియాలని కోరుకుంటూ ఖేడ్ మండలం రుద్రారం గ్రామ రైతులు ఆదివారం బీరప్పదేవుడి పండగను ఘనంగా నిర్వహించారు. భజనలతో గ్రామం నుంచి గ్రామ శివారులోని బీరప్ప ఆలయానికి వెళ్లి స్వామి వారికి ప్రత్యేకపూజలు చేశారు. అన్నప్రసాద వితరణ చేపట్టారు. వివిధ పార్టీల గ్రామనాయకులు ప్రభాకర్, శ్రీకాంత్‌రెడ్డి, సిందోల్ దశరథ్, రైతులు పాల్గొన్నారు.