
వన మహోత్సవానికి సర్వం సిద్ధం
ప్రభుత్వ ఆదేశాలతో..
ప్రభుత్వ ఆదేశాలతో వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. ముందస్తు ప్రణాళికతో నర్సరీలు ఏర్పాటు చేశాం. ఒక్కో నర్సరీలో 6 వేల వరకు మొక్కలను పెంచాం. మొక్కలు నాటడానికి సిద్ధంగా ఉన్నాయి. సమృద్ధిగా వర్షాలు పడిన వెంటనే ప్రభుత్వ ఆదేశాలతో మొక్కల నాటే కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం.
– అశోక్ కుమార్, ఏపీఓ,
జహీరాబాద్
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన హరితహారంకు కొనసాగింపుగా కాంగ్రెస్ సర్కారు వనమహోత్సవం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. వర్షాకాలం సీజన్ మొదలు కావడంతో జూలై నుంచి వన మహోత్సవంను ప్రారంభించేందుకు తగిన ఏర్పాట్లను చేస్తోంది. ఇందుకు సంబంధించి అధికార యంత్రాంగం ఇప్పటికే పనుల్లో నిమగ్నమైంది.
జహీరాబాద్ టౌన్: అడవుల శాతాన్ని పెంచేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. కాలుష్యం పెరిగి వాతావరణంలో సమత్యుం లోపిస్తుంది. వేసవిలో ఎండలు మండుతున్నాయి, సరైన సమయంలో వానలు పడక రైతులు అవస్థలు పడుతున్నారు. సమస్యను అధిగమించడానికి గ్రామాల్లో పెద్ద ఎత్తున మొక్కలను నాటేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామీణ జాతీయ ఉపాధిహామీ పథకం కింద జిల్లాలోని ప్రతి పంచాయతీకో నర్సరీనికి ఏర్పాటు చేసి మొక్కలను పెంచుతున్నారు. జిల్లాలో 26 మండలాల్లో 647 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతీ గ్రామ పంచాయతీల్లో నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలను పెంచుతున్నారు. ఒక్కో నర్సరీలో 6 వేల వరకు పెంచారు. ప్రతీ పంచాయతీలో 3 వేల మొక్కలను నాటాలని లక్ష్యం పెట్టుకున్నారు. జిల్లాలో 19.50 లక్షల మొక్కలను నాటనున్నారు. ఎవెన్యూ ప్లాంటేషన్, ప్రభుత్వ ఖాళీ స్థలాలు, అటవీ భూములు, ఊరు వాడ, రోడ్డు పక్కన ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటేందుకు ఉపాధి హామీ కూలీలతో గుంతలను తవ్విస్తున్నారు.
ఇవీ నర్సరీల్లో మొక్కలు
ఆహ్లాదాన్ని పంచే, నీడ, ఫల సాయం అందించే మొక్కలను పంపిణీ చేసి నాటనున్నారు. దానిమ్మ, జామ, మునగ, అల్లనేరేడు, బొప్పాయి, బాదం, ఉసిరి, ఈత, మందారం, గులాబీ, జాస్మిన్, గుల్‌మోహర్, కానుగ, వేప,చింత, గన్నేరు, మేంది, జామ, మునుగ, మామిడి, కరివేపాకు తదితర రకాల మొక్కలు నాటేందుకు నర్సరీల్లో సిద్ధంగా ఉన్నాయి.
19.50 లక్షల మొక్కలునాటాలని లక్ష్యం
ప్రతీ పంచాయతీలో మూడు వేలు..
నర్సరీలో 6 వేల వరకుమొక్కల పెంపకం
వన మహోత్సవానికి యంత్రాంగం సిద్ధం

వన మహోత్సవానికి సర్వం సిద్ధం