
మంజీరా మరమ్మతుకు 3.5కోట్లు
నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ
సంగారెడ్డి టౌన్ : సంగారెడ్డి మండలంలోని మంజీరా డ్యామ్ ను శుక్రవారం నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ, జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జంట (హైదరాబాద్, సికింద్రాబాద్) నగరాలకు తాగునీరు అందించే మంజీరా డ్యామ్‌కు ఎలాంటి పగుళ్లు లేవన్నారు. మంజీరా డ్యామ్ మరమ్మతుల కోసం రూ.3.5 కోట్లు కేటాయించామని తెలిపారు. అనంతరం డ్యామ్‌ను పరిశీలించారు. ఆర్డీవో రవీందర్‌రెడ్డి, హెచ్‌ఎండబ్ల్యూఎస్ పటాన్‌చెరు డివిజన్ జనరల్ మేనేజర్ మాణిక్యం, నీటిపారుదల శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.