
ఫ్యాన్సీ స్టోర్ నడుపుతున్న
సీ్త్ర నిధి ద్వారా మూడు లక్షల రుణం తీసుకున్న. ఆ డబ్బుతో ఫ్యాన్సీ స్టోర్ దుకాణం ఏర్పాటు చేసిన. తీసుకున్న రుణాన్ని ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నాను. అలాగే పొదుపులో కూడా ప్రతి నెలా డబ్బులు కడుతున్నాం. ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు సీ్త్రనిధి ఉపయోగపడుతుంది.
– సరస్వతి, తాలేల్మా గ్రామం, అందోల్
శుభకార్యాలకు డెకరేషన్
సీ్త్ర నిధి ద్వారా రుణం తీసుకున్న. ఈ డబ్బులతో వివాహాలకు సంబంధించిన డెకరేషన్ వస్తువులను కొనుగోలు చేశా. వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషిస్తున్నా. శుభ కార్యాలకు డెకరేషన్ నిర్వహిస్తూ మంచి ఆదాయం పొందుతున్న.
– పద్మ, దేవుని గ్రామం, వట్టిపల్లి
మంచి అవకాశాలు
మహిళా సంఘాల్లోని సభ్యులకు మంచి అవకాశాలు ఉన్నాయి. సీ్త్ర నిధి ద్వారా మూడు లక్షలు రుణం తీసుకొని సొంతంగా టెంట్ హౌస్‌ను నడుపుతున్న. గ్రామంలోనే ఉంటూ వివాహాది శుభకార్యాలు, ఇతర కార్యక్రమాలకు సామాన్లు ఇస్తూ మంచి ఆదాయం ఆర్జిస్తున్నాను.
– లక్ష్మి, ఇస్మాయిల్ ఖాన్‌పేట్, సంగారెడ్డి

ఫ్యాన్సీ స్టోర్ నడుపుతున్న

ఫ్యాన్సీ స్టోర్ నడుపుతున్న