
గురుకులాల్లో జేఎల్ పోస్టుల భర్తీ
జహీరాబాద్ టౌన్: తాత్కాలిక అధ్యాపకుల పోస్టులకు మహిళా అభ్యర్థుల నుంచి గిరిజన సంక్షేమ గురుకుల కళాశాల దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ మేరకు మొగుడంపల్లి గురుకుల ప్రిన్సిపాల్ హిమబిందు గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు. భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం, పీడీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు. ఈ నెలాఖరు వరకు జిన్నారం గురుకులంలో దరఖాస్తు చేసుకోవాలని, జూలై 1 తేదీన ఒరిజినల్ సర్టిఫికెట్లతో అభ్యర్థులు హాజరుకావాలని చెప్పారు. పీజీలో 55% మార్కులు సాధించి ఇంగ్లిష్ మీడియం అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులన్నారు. పూర్తి వివరాలకు 9346436829, 98492,37238 నంబర్‌కు సంప్రదించాలని చెప్పారు.
మత్తు పదార్థాలకు
దూరంగా ఉండాలి
న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి సౌజన్య
సంగారెడ్డి టౌన్ : యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి సౌజన్య పేర్కొన్నారు. సంగారెడ్డి మండలంలోని పసల్వాది గ్రామ శివారులోని ఎంఎన్‌ఆర్ వైద్య కళాశాలలో గురువారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా న్యాయ అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..మాదకద్రవ్యాల వినియోగం అనారోగ్యాలకు గురి చేయడమే కాకుండా వాటికి బానిసలుగా మారుస్తుందన్నారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర సమస్యలకు గురవుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డి ట్రాఫిక్ సీఐగా రామకృష్ణారెడ్డి
సంగారెడ్డి క్రైమ్ : సంగారెడ్డి ట్రాఫిక్ సీఐగా రామకృష్ణారెడ్డి నియమితులయ్యారు. మల్టీజోన్–2 నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చిన ఆయన గురువారం బాధ్యతలు స్వీకరించారు. కాగా, ఇక్కడ విధులు నిర్వహించిన సీఐ సుమన్ కొండాపూర్‌కు బదిలీపై వెళ్లారు.
దివ్యాంగులకు
పింఛను ఇవ్వండి
కంగ్టి (నారాయణఖేడ్): అర్హులైన దివ్యాంగులకు పింఛను అందించాలని కేవీపీఎస్ జిల్లా నాయకుడు బి.శ్రీనివాస్ కోరారు. సిర్గాపూర్ ఎంపీడీవో మన్సుర్ నాయక్ గురువారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో అర్హులున్నా చాలామందికి పింఛను రావడంలేదన్నారు. 90% వైకల్యం ఉన్న వారికి కూడా పింఛను జారీ చేయడంలేదని, అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో సంఘం నాయకులు పండరీ, శ్రీకాంత్, కృష్ణ పాల్గొన్నారు.
రాళ్ల ధరలు
పెంచడం తగదు
జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ ప్రాంతంలో లభించే ఎర్ర రాళ్ల ధరలు పెంచడంతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులపై ఆర్థికభారం పడుతుందని పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు సురేష్ గురువారం ఓ ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. స్థానికంగా లభించే ఎర్రరాళ్లతోనే ఈ ప్రాంతంలో ఇళ్ల నిర్మాణం పనులు చేపడతారని చెప్పారు. పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇళ్ల పనులు ప్రారంభంకావడంతో వ్యాపారులు రాళ్ల ధరలు ఒక్కసారిగా పెంచారని ఆరోపించారు. రూ.15కు లభించే రాయిని ఒక్కసారిగా రూ.25కు పెంచారని చెప్పారు. రెవెన్యూ అధికారులు చొరవ తీసుకుని ఇందిరమ్మ ఇళ్లకు తక్కువ ధరకు రాళ్లను ఇప్పించాలని కోరారు.
విలీన గ్రామాల్లో
ఉపాధి కొనసాగించాలి
సంగారెడ్డి ఎడ్యుకేషన్: మున్సిపల్‌లో విలీనమైన గ్రామాల్లో ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నర్సింహులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్‌లో ఇన్‌చార్జి ఏఓ సదానందంకు వినతి పత్రం అందజేశారు.

గురుకులాల్లో జేఎల్ పోస్టుల భర్తీ

గురుకులాల్లో జేఎల్ పోస్టుల భర్తీ