
శాండ్ బజార్‌కోసం స్థలం పరిశీలన
నారాయణఖేడ్: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇసుక అందజేసేందుకు నిజాంపేట్ మండల కేంద్రంలోని 79 సర్వే నంబరులో శాండ్ బజార్ ఏర్పాటుకు 14 ఎకరాల స్థలాన్ని గృహనిర్మాణశాఖ పీడీ చలపతిరావు, నిజాంపేట్ తహసీల్దార్ నాగజ్యోతి, ఆర్‌ఐ జాన్సన్, రాష్ట్ర గనుల శాఖ అధికారులు గురువారం పరిశీలించారు. నిజాంపేట్, కల్హేర్, సిర్గాపూర్ మండలాల్లో ఇళ్లు నిర్మించుకునే లబ్ధిదారులకు ఇక్కడి నుంచే ఇసుకను అందజేస్తామని చలపతిరావు చెప్పారు. ఖేడ్ మండలం జూకల్ శివారులోని స్థలంలో నిల్వ చేసే ఇసుకను నారాయణఖేడ్, నాగల్‌గిద్ద, మనూరు, కంగ్టి మండలాల లబ్ధిదారులకు అందిస్తామన్నారు.