
ప్రజాస్వామ్య హక్కుల కు పోరాటం చేద్దాం
సీపీఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు వీరయ్య
పటాన్‌చెరు టౌన్: ప్రజాస్వామ్యం కల్పించిన హక్కులను రక్షించుకోవడానికి పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్ వీరయ్య ప్రజానీకం, కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. బుధవారం సీపీఎం సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పటాన్‌చెరు పట్టణంలోని శ్రామిక్ భవన్‌లో ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన సెమినార్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజల్లో ఉన్న అసంతృప్తిని పక్కదారి పట్టించడం కోసం ఇందిరా గాంధీ ఆనాడు ఎమర్జెన్సీ విధించిందని గుర్తు చేశారు. ప్రజాస్వామ్య హక్కుల రక్షణ కోసం, జులై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను ప్రజలు, కార్మికులు జయప్రదం చేయాల ని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి జి.జయరాజు, కమిటీ సభ్యులు నాగేశ్వరరావు, ీవాజిద్ అలీ, పాండు రంగారెడ్డి, రాజు, ప్రసాద్, సత్తిబాబు, రామచంద్ర మూర్తి పాల్గొన్నారు.