
ఎక్కడి సమస్యలు అక్కడే
తూప్రాన్: మున్సిపాలిటీల్లో ప్రత్యేక పారిశుద్ధ్య ప్రణాళిక నామమాత్రంగా కొనసాగుతుంది. మురికి కాలువల శుభ్రం, రోడ్లకు ఇరువైపులా పిచ్చి మొక్కల తొలగింపు, తడి, పొడి చెత్త పనులపై అధికారులు అవగాహన కల్పించి చేతులు దులుపుకుంటున్నారు. పట్టణంలోని16 వార్డుల్లో అధికంగా 5, 6, 12, వార్డుల్లో సమస్యలు ఉన్నాయి. చిన్నపాటి వర్షానికి గుంతలమయంగా రోడ్లు, బురదమయంగా నడవరాని పరిస్థితి నెలకొంది. ఈ కాలనీల్లో గతంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం నిర్మించిన మ్యాన్‌హోల్స్ ప్రమాదకరంగా మారాయి. క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారం కావడం లేదన్న విమర్శలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి