సీఎంని కలిసిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మురళీకృష్ణ | - | Sakshi
Sakshi News home page

సీఎంని కలిసిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మురళీకృష్ణ

Jun 26 2025 10:07 AM | Updated on Jun 26 2025 11:53 AM

పటాన్‌చెరు: ఇటీవల టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన పటాన్‌చెరుకు చెందిన బాలమురళీకృష్ణ (చిన్న ముదిరాజ్‌) బుధవారం గాంధీ భవన్‌లో రాష్ట్ర కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. టీపీసీసీలో తనకు చోటు కల్పించినందుకు ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి, ప్రవేశపెట్టిన పథకాలు ప్రజల్లోకి చేరేందుకు తనవంతు కృషి చేస్తానని మురళీకృష్ణ చెప్పారు.

పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి

జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి సౌజన్య

సంగారెడ్డి టౌన్‌: పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి సౌజన్య పేర్కొన్నారు. సంగారెడ్డి పట్టణంలోని సబిత ప్రతిభావంతుల పాఠశాలను బుధవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలన్నారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్‌, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

10 పుణ్యక్షేత్రాలకు రేపు ప్రత్యేక బస్సులు

నారాయణఖేడ్‌: రాష్ట్రంలోని 10 పుణ్యక్షేత్రాలను దర్శించుకుని వచ్చేలా ఖేడ్‌ నుంచి ఈనెల 27న గురువారం ప్రత్యేకంగా ఒక సూపర్‌లగ్జరీ, ఒక ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులను నడుపుతున్నట్లు ఆర్టీసీ డీఎం మల్లేశయ్య తెలిపారు. బస్సులు ఉదయం 8గంటలకు ఖేడ్‌ నుంచి బయల్దేరి 36 గంటల పాటు ప్రయాణించి 10 పుణ్యక్షేత్రాలైన వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కాళేశ్వరం, రామగుండం, మిడ్‌మానేరుడ్యాం, వరంగల్‌, సిద్దిపేట, మెదక్‌, ఏడుపాయలను దర్శించుకుని 28న సాయంత్రం తిరిగి ఖేడ్‌కు చేరుకుంటాయని తెలిపారు. ఒక్కొక్కరికి ఎక్స్‌ప్రెస్‌ బస్సుకు రూ.1,400, డీలక్స్‌బస్‌కు రూ.1,600 చార్జీ ఉంటుందన్నారు. కొన్ని సీట్లు మాత్రమే మిగిలి ఉన్నందున అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలు, టికెట్‌ బుకింగ్‌ కోసం 9959223170, 9441071134, 9676667703 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి

సంగారెడ్డి ఎడ్యుకేషన్‌: జూలై 9న నిర్వహించే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మల్లేశం కార్మికులకు పిలుపునిచ్చారు. సంగారెడ్డిలోని సుందరయ్యభవన్‌లో బుధవారం జరిగిన జిల్లా కాంట్రాక్ట్‌ కార్మికుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక, రైతు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందన్నారు. కార్మికవర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి పెట్టుబడిదారులకు అనుకూలంగా నాలుగు లేబర్‌ కోడ్‌లను తెచ్చిందన్నారు. వెంటనే లేబర్‌ కోడ్‌లు రద్దు చేయడంతో పాటు కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. అనంతరం కాంట్రాక్ట్‌ కార్మికుల యూనియన్‌ జిల్లా అధ్యక్షుడిగా మాణిక్యం, కార్యదర్శిగా సురేశ్‌ను ఏకగీవ్రంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు పాల్గొన్నారు.

దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి1
1/2

దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి

సీఎంని కలిసిన టీపీసీసీ రాష్ట్ర  ప్రధాన కార్యదర్శి మురళీ2
2/2

సీఎంని కలిసిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మురళీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement