
మరణంలోనూ భర్త వెంటే..
● ఒక్కరోజు వ్యవధిలో దంపతుల ఆత్మహత్య ● సంగారెడ్డి జిల్లా బొల్లారంలో విషాదం
జిన్నారం (పటాన్‌చెరు): భర్త మరణాన్ని జీర్ణించుకోలేక భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సిఐ రవీందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బొల్లారం పట్టణ పరిధిలోని వైఎస్సార్ కాలనీలో నివాసముంటున్న గొల్ల గణేష్ (55) అనారోగ్య సమస్యతో బాధపడుతూ మనస్తాపానికి గురై శనివారం రాత్రి ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన భార్య అమరావతి (47) భర్త మరణాన్ని జీర్ణించుకోలేక సోమవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో చీరతో అదే ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. 24 గంటల వ్యవధిలో భార్యాభర్తలు మృతి చెందడంతో కాలనీ లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇరువురి మరణం భార్యాభర్తల ప్రేమ అనుబంధాలకు నిదర్శనంగా నిలిచిందని సంఘటనను చూసిన ప్రతి ఒక్కరి కళ్ళు చెమ్మగిల్లాయి.

మరణంలోనూ భర్త వెంటే..