
అండర్ డ్రైనేజీ పనులు ప్రారంభం
సంగారెడ్డి టౌన్: కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని ఆపార్టీ సీనియర్ నాయకుడు కర్కం శ్రీశైలం యాదవ్ అన్నారు. పట్టణంలోని 9వ వార్డు గొల్లగూడెం కాలనీలో కొన్ని సంవత్సరాల నుంచి మురికి నీరు పోవడానికి కాలువలు సరిగ్గా లేక అవస్థలు పడుతున్న కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం శ్రీశైలంయాదవ్ అండర్ డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చాలా సంవత్సరాల తర్వాత మురికి నీటి సమస్యకు పరిష్కారం లభించిందన్నారు. కాలనీవాసులకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తానన్నారు. అనంతరం కాలనీవాసులు ఆయనను సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కిరణ్‌గౌడ్, సతీష్‌రెడ్డి, రాంరెడ్డి, కాలనీవాసులు రాజేశ్వర్, మాణిక్యం, నవీన్, జగన్ తదితరులు పాల్గొన్నారు.