నారాయణఖేడ్: ప్రతి ఒక్కరూ భగవద్గీతను ఆచరిస్తూ తమ జీవితాలను సుఖమయం చేసుకోవాలని కొండాపూర్ ఆశ్రమ పీఠాధిపతి సంగ్రాం మహరాజ్ అన్నారు. ఖేడ్‌లోని షిర్డీ సాయిబాబా ఆలయ దశమ వార్షికోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో అభిషేకం, అలంకరణ, హారతి, కార్యక్రమాలతో పాటు సామూహిక కుంకుమార్చనలు, హోమం, చప్పన్‌భోగ్ ప్రసాదాల సమర్పణ కార్యక్రమాలను ఆలయ ప్రధాన అర్చకులు మోహన్‌జ్యోషి ఆధ్వర్యంలో నిర్వహించారు. అంతర్గాం పీఠాధిపతి కరణ్ గజేంద్ర భారతి మహరాజ్, రాధాస్వామి సత్సంగ్ భక్తుడు రామకృష్ణ పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా పిట్లంకు చెందిన క్రిష్ణమూర్తి బృందం సంగీత విభావరి నిర్వహించారు. భక్తులకు ఉపాధ్యాయులు శివరాంపల్లి విజయ్ కుమార్, భారతి దంపతులు మహాప్రసాదాన్ని అందించారు.