
వికాస్‌నగర్ వెల్ఫేర్ సొసైటీ వద్ద ఉద్రిక్తత
పటాన్‌చెరు: మండలం పరిధి ఇంద్రేశం గ్రామంలోని వికాస్‌నగర్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు ప్లాట్లు యజమానులను వెంచర్ల లోపలికి వెళ్లనివ్వకుండా గేటు వేయడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్లాట్ల యజమానులు వెంచర్ అభివృద్ధి నిమిత్తం మాట్లాడుకునేందుకు వచ్చి ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో సీఐ వినాయక్ రెడ్డి వచ్చి ఇరు వర్గాల వారితో మాట్లాడారు. ప్లాట్లు యజమానులు లోనికి రానివ్వకుండా అడ్డు చెప్పవద్దని సొసైటీ సభ్యులను హెచ్చరించారు. ఏదైనా సమస్య ఉంటే రెండు రోజుల తర్వాత ఇరు వర్గాల వారు దస్త్రాలు తీసుకువస్తే సమస్యను పరిష్కరిస్తానని సీఐ తెలిపారు.