
మాజీ చైర్మన్‌కు పరామర్శ
శివ్వంపేట(నర్సాపూర్): మండల పరిధి గుండ్లపల్లి గ్రామానికి చెందిన నర్సాపూర్ ఆత్మకమిటీ మాజీ చైర్మన్ గొర్రె వెంకట్‌రెడ్డి అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆదివారం ఎమ్మెల్యే హరీశ్‌రావు వెంకట్‌రెడ్డిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట బీఆర్‌ఎస్ నాయకులు హరికృష్ణ, మన్సూర్, రమాకాంత్‌రెడ్డి, తదితరులు ఉన్నారు.
ఉచిత వైద్య శిబిరం
జిన్నారం (పటాన్‌చెరు): గడ్డపోతారం మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. లీఫార్మా పరిశ్రమ, లయన్స్ క్లబ్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన శిబిరాన్ని సభ్యులతో కలిసి మాజీ సర్పంచ్ ప్రకాశంచారి ప్రారంభించారు. ఈ సందర్భంగా లయన్స్ ఐ హాస్పిటల్ వైద్య బృందం పారిశ్రామికవాడలోని పేదలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో క్లబ్ సభ్యులు కోమల్ రెడ్డి, ప్రకాష్, నరేందర్ బాబు, ఎంఎస్‌రెడ్డి, మౌలాలి పాల్గొన్నారు.
వీరశైవ లింగాయత్‌ల
ప్రమాణ స్వీకారం
రాయికోడ్(అందోల్): రాయికోడ్‌లోని వీరభద్రేశ్వర ఆలయ ఫంక్షన్ హాలులో ఆదివారం వీర శైవ లింగాయత్ మండల, గ్రామాల అధ్యక్షుల ప్రమాణ స్వీకారం చేశారు. వీర శైవ లింగాయత్ మండల అధ్యక్షుడిగా సంగమేశ్వర్ పాటిల్, ఆయా గ్రామాల అధ్యక్షులు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో ఇందూర్ ఆశ్రమ నిర్వహకులు చిన్న మల్లికా ర్జునస్వామి, వీరశైవ లింగాయత్ జిల్లా అధ్యక్షులు నర్సింలు, నాయకులు రాజేశ్వర్, మల్లికార్జున్, అరుణ, వివిధ గ్రామాల లింగాయత్ సమాజ పెద్దలు, సభ్యులు పాల్గొన్నారు.