
స్థానిక సంస్థల్లో సత్తా చాటాలి
కంది(సంగారెడ్డి): రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకొని కాంగ్రెస్ పార్టీ సత్తాచాటాలని టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆదివారం కంది, సంగారెడ్డి మండలాల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మలారెడ్డి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను కార్యకర్తలు ప్రజలకు వివరించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా పరిశీలకులు, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. కష్టకాలంలో పార్టీతో ఉన్న వారందరినీ ఆదుకుంటామన్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డు వంటి పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం పటిష్టంగా అమలు చేస్తుందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా కార్యకర్తలు కృషి చేయాలన్నారు. బీఆర్‌ఎస్ నాయకులు సోషల్ మీడియా ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జ్ ఆంజనేయులు, పీసీసీ ప్రధాన కార్యదర్శిలు తోపాజి అనంత కిషన్, చిన్నా ముదిరాజ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రఘు గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్రనాయక్ తదితరులు పాల్గొన్నారు.
టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి