
రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం
పటాన్‌చెరు టౌన్: రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి అన్నారు. ఆదివారం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద రైతు భరోసా విడుదలపై హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నరసింహారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులకు రూ.8,565 కోట్లను రైతు భరోసా కింద వారి జమ అవుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొందన్నారు. తెలంగాణ ఉద్యమంలో వందలాది విద్యార్థుల ఆత్మబలిదానాలకు కారకుడైన హరీశ్‌రావు మరొకసారి జిన్నారం రైతులను రెచ్చగొట్టి వారిని వారి కుటుంబాలకు నష్టాన్ని కలిగించే పక్కా ప్రణాళికలో ఉన్నారని ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సంజీవరెడ్డి, జీ పీసీసీ కార్యదర్శి మతిన్, ట్టణ ఉపాధ్యక్షుడు యువరాజ్, యువజన కాంగ్రెస్ నాయకులు మల్లేశ్‌యాదవ్, అక్షిత్ హనుమంతు, నాయకులు విజయ్, నాగయ్య, అశోక్ , రమేష్ ,సంజయ్ ప్రవీణ్ పాల్గొన్నారు.
ఐఎన్‌టీయూసీ జిల్లా
అధ్యక్షుడు నరసింహారెడ్డి