
స్థానిక ఎన్నికల కోసమే హడావిడి
నారాయణఖేడ్: స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రజలను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ నాయకులు హడావిడి చేస్తున్నారని ఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి విమర్శించారు. ఆదివారం ఖేడ్‌లోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడుతూ.. రైతు భరోసా కింద సహాయం రూ.15 వేలకు పెంచుతామని ఎన్నికలకు ముందు హామీనిచ్చి రెండు విడతలు ఇవ్వకపోగా ప్రస్తుతం రూ.12 వేలకు పరిమితం చేశారన్నారు. ఇందిరమ్మ ఇళ్ల భూమి పూజల పేరిట సందడి చేస్తున్నారని ఆరోపించారు. చిత్తశుద్ధి ఉంటే లబ్ధిదారుల ఖాతాల్లో అడ్వాన్సుగా బిల్లులు వేసి నిర్మించుకునేలా చేయాలన్నారు. కాంగ్రెస్ మోసాలను ప్రజలు గమనిస్తున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. మాజీ జెడ్పీటీసీ రవీందర్ నాయక్, మండల మాజీ సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు జగదీశ్వరాచారి, ముజమ్మిల్, సంగప్ప, వెంకటేశం, మల్గొండ, లక్ష్మన్‌రావు పాల్గొన్నారు.