
రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొట్టిన కారు
పటాన్‌చెరు టౌన్: రోడ్డు దాటుతున్న వ్యక్తిని కారు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన అమీన్‌పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని గండిగూడెం వైఎస్సార్ కాలనీకి చెందిన లక్ష్మణ్ ట్రాక్టర్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం ట్రాక్టర్ నడిపేందుకు వెళ్లి పని ముగించుకొని సాయంత్రం తిరిగి ఇంటికి నడుచుకుంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో గండిగూడెం శివారు ఓఆర్‌ఆర్ సర్వీస్ రోడ్డు దాటుతుండగా పటాన్‌చెరు వైపు నుంచి దుండిగల్ వైపు వెళ్లే గుర్తుతెలియని కారు ఢీకొట్టింది. దీంతో లక్ష్మణ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
నోరూరిస్తున్న అల్లనేరేడు
మిరుదొడ్డి(దుబ్బాక): అల్లనేరేడు పండ్లను చూడగానే నోరూరిస్తున్నాయి. వగరు, పుల్లగా, తియ్యగా మేలు రుచులతో ఉండే నేరేడు పండ్లకు మార్కెట్‌లో మంచి డిమాండ్ పలుకుతోంది. దీంతో గ్రామీణ ప్రాంత వాసులకు, రైతులకు మంచి ఉపాధిగా మారుతోంది.
తీవ్ర గాయాలు.. ఆస్పత్రికి తరలింపు