విద్యుదాఘాతంతో ఎలక్ట్రీషియన్‌ మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో ఎలక్ట్రీషియన్‌ మృతి

Jun 23 2025 8:41 PM | Updated on Jun 23 2025 8:41 PM

విద్య

విద్యుదాఘాతంతో ఎలక్ట్రీషియన్‌ మృతి

తూప్రాన్‌, మనోహరాబాద్‌(తూప్రాన్‌): పొలం వద్ద కరెంటు మరమ్మతులు చేస్తుండగా విద్యుదాఘాతంతో ఎలక్ట్రీషియన్‌ మృతి చెందాడు. ఈ ఘటన మనోహరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ సుభాష్‌గౌడ్‌ వివరాల ప్రకారం... తూప్రాన్‌ మండలంలోని అల్లాపూర్‌ గ్రామానికి చెందిన మర్రి రాములు( 49) పదేళ్లుగా కాళ్లకల్‌ గ్రామ పంచాయతీలో ఔట్‌సోర్సింగ్‌ విద్యుత్‌ ఎలక్ట్రీషియన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే తాను సొంతంగా ప్రైవేట్‌గా విద్యుత్‌ మరమ్మతు పనులు కూడా చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం సెలవు కావడంతో రాములు, మరో కార్మికులు నర్సింహ, మైలారం మల్లేష్‌లతో కలిసి కాళ్లకల్‌ గ్రామానికి చెందిన రైతులు సాయం సంజీవ, దుర్గయ్యల పొలంలో విద్యుత్‌ మరమ్మతుల పనులు చేయడానికి వెళ్లారు. కాగా అక్కడ స్టాటర్‌బాక్స్‌కు విద్యుత్‌ సరఫరా రావడం లేదు. దీంతో రాములు విద్యుత్‌ స్తంభం ఎక్కి వైర్‌ సరి చేసే క్రమంలో విద్యుత్‌ షాక్‌కు గురై తీవ్రగాయాలపాలయ్యాడు. వెంటనే అతడ్ని తూప్రాన్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న మృతుని కుటుంబీకులు, అల్లాపూర్‌ గ్రామస్తులు ప్రభుత్వ ఆస్పత్రి ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు సముదాయించి ఆందోళన విరమింపజేశారు. కాగా మృతునికి భార్య, ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. మృతుని కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తి..

కొండపాక(గజ్వేల్‌): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన కుకునూరుపల్లి మండల కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివా స్‌ కథనం ప్రకారం... సంగారెడ్డి జిల్లాలోని అన్నా రం గ్రామానికి చెందిన అవిరాల్‌ సింగ్‌ టొమర్‌ (27) వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సంగారెడ్డి నుంచి ఉదయం రెండు ద్వి చక్ర వాహనాలపై స్నేహితులతో కలిసి రంగనాయ క్‌ సాగర్‌ను సందర్శించేందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో కుకునూరుపల్లి శివారులో వాహనం అదుపు తప్పి రాజీవ్‌ రహదారి రోడ్డు ప్రక్కన ఉన్న చెట్లలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అవిరాల్‌ సింగ్‌ టొమర్‌కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. స్నేహితులు కుటుంబీకులకు సమాచా రం అందించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో ఫొటోగ్రాఫర్‌..

గజ్వేల్‌రూరల్‌: రోడ్డు ప్రమాదంలో ఫొటోగ్రాఫర్‌ గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన గజ్వేల్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... పట్టణానికి చెందిన కాశమైన చేతన్‌కుమార్‌(23) ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. మూడ్రోజుల క్రితం జగదేవ్‌పూర్‌లోని పోలీస్‌స్టేషన్‌ సమీపంలో ద్విచక్ర వాహనంపై వస్తున్న చేతన్‌కుమార్‌ను ట్రావెల్‌ బస్సు ఢీకొట్టడంతో తలకు తీవ్రగాయాలై కోమాలోకి వెళ్లాడు. మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్‌లోని యశోదా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి బ్రెయిన్‌ డెడ్‌తో మృతి చెందాడు. తీవ్ర దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులు అవయవదానానికి ఒప్పుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ డాక్టర్‌ యాదవరెడ్డి, ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ రాజమౌళి, పలువురు ప్రముఖులు కుటుంబ సభ్యులను పరామర్శించారు. గజ్వేల్‌ ఫొటో అండ్‌ వీడియోగ్రాఫర్‌ అసోసియేషన్‌ సభ్యులు చేతన్‌కుమార్‌ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు.

బస్సు,కారు ఢీ..

–ప్రయాణికులకు స్వల్ప గాయాలు

సదాశివపేట రూరల్‌(సంగారెడ్డి): రోడ్డు ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.ఈ ఘటన మండలంలోని నందికంది శివారులో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. నందికంది గ్రామ సమీపంలో అదుపుతప్పిన బస్సు కారును ఢీకొట్టింది. ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. జాతీయ రహదారిపై కొనసాగుతున్న సర్వీస్‌ రోడ్డు నిర్మాణ పనుల్లో రోడ్డు భద్రత చర్యలు చేపట్టకుండా పనులు చేపడుతుండటంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

విద్యుదాఘాతంతో ఎలక్ట్రీషియన్‌ మృతి 1
1/1

విద్యుదాఘాతంతో ఎలక్ట్రీషియన్‌ మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement