
యువతి అదృశ్యం
పటాన్‌చెరు టౌన్: ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువతి అదృశ్యమైంది. ఈ ఘటన అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... మెదక్‌కు చెందిన స్వరూప, కూతురు లావణ్యతో కలిసి నాలుగు రోజుల క్రితం అమీన్‌పూర్‌లో ఉండే పెద్ద కూతురు భానుప్రియ వద్దకు వచ్చింది. శనివారం భానుప్రియ కూలీ పనికి వెళ్లింది. ఈ క్రమంలో ఇంటి వద్ద ఉన్న లావణ్య బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు స్థానికంగా, చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. తల్లి స్వరూప ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
అమ్మమ్మను చూసేందుకు వచ్చి..
పటాన్‌చెరు టౌన్: అమ్మమ్మను చూసేందుకు వచ్చిన యువతి అదృశ్యమైంది. ఈ ఘటన అమీన్‌పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి తణుకు మండలం వేల్పూరు గ్రామానికి చెందిన దివ్య ఈనెల 15వ తేదీన గచ్చిబౌలి కేర్ ఆస్పత్రిలో ఉన్న అమ్మమ్మ వెంకట వరలకి్‌ష్మ్‌ని చూసేందుకు వచ్చింది. ఈ క్రమంలో 18వ తేదీన ఆమెను డిశ్చార్జ్ చేయగా వారితో కలిసి అమీన్‌పూర్ మున్సిపాలిటీలోని బీరంగూడ వందనపుర కాలనీకి వచ్చింది. ఈ క్రమంలో ఆదివారం ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు కోసం వెతకగా బ్యాగు తీసుకుని వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.

యువతి అదృశ్యం