
చెట్టును ఢీకొట్టిన కారు
దుబ్బాకటౌన్: శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టాడు. ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందిన ఘటన రాయపోల్ మండలం మంతూర్ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... మండల కేంద్రానికి చెందిన కుంట దుర్గాప్రసాద్ (36) హైదరాబాద్‌లో కార్ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం తమ్ముడి ఇంట్లో శుభకార్యం ఉండటంతో ఇక్కడికి వచ్చాడు. శనివారం ఉదయం రాయపోల్ నుంచి సిద్దిపేట మీదుగా హైదరాబాద్ బయలుదేరాడు. మంతూర్ గ్రామ సమీపంలో కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో దుర్గాప్రసాద్ మృతి చెందాడు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రాయపోల్ ఎస్‌ఐ రఘుపతి తెలిపారు.
డ్రైవర్ మృతి

చెట్టును ఢీకొట్టిన కారు