
ఫీజు వసూలు లక్ష్యంరూ.3.90 కోట్లు
రాయికోడ్ మార్కెట్ ఆదాయం సమకూర్చేందుకు నిర్ణయం
రాయికోడ్(అందోల్): 2025–26 ఆర్థిక ఏడాదికిగాను రాయికోడ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో రూ.3.90 కోట్లను మార్కెట్ ఫీజు వసూలు చేయాలని నిర్ణయించారు. మార్కెట్ పరిధిలో రాయికోడ్, మునిపల్లి మండలాలు ఉన్నాయి. రాయికోడ్ మండలంలో రెండు, మునిపల్లి మండలంలో మూడు పత్తి జిన్నింగ్ మిల్లులు ఉన్నాయి. రాయికోడ్ మండలంలో ఒక చెక్‌పోస్టు ఉంది. మార్కెట్‌కు ప్రధానంగా మిల్లులు, సీసీఐ కేంద్రాల ద్వారా ఆదాయం సమకూరుతుంది. 2025–26 ఏడాదిలో చెక్‌పోస్టు ద్వారా రూ.25 లక్షల రుసుం వసూలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. సీసీఐ కేంద్రాల ద్వారా రూ.2.55 కోట్లు, జిన్నింగ్ మిల్లుల ద్వారా రూ.1.10 కోట్ల ఫీజు వసూలు అవుతుందని అధికారులు తెలిపారు. నిర్ణీత సమయంలో లక్ష్యం మేర రుసుం వసూలు పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు.
లక్ష్యానికి మించి ఆదాయం
2024–25 ఆర్థిక సంవత్సరంలో 3.86 కోట్ల ఆదాయాన్ని మార్కెట్ కమిటీకి సమకూర్చాలని నిర్ణయించారు. లక్ష్యానికి మించి రూ.రూ.3.91 కోట్ల ఆదాయం సమకూరింది. వచ్చిన ఆదాయం 101% వచ్చినట్లు మార్కెట్ యార్డు కార్యదర్శి రవికుమార్ తెలిపారు. రాయికోడ్ మార్కెట్ కమిటీకి ప్రధానంగా పత్తి పంట ద్వారానే సమకూరుతుంది. రాయికోడ్, మునిపల్లి మండలాల్లో ప్రధానంగా పత్తి పంటనే పండిస్తారు. అధిక ఆదాయం పత్తి మిల్లులు, సీసీఐ కేంద్రాల ద్వారా ఆదాయం వస్తోంది. ఇక రైతుల పంట ఉత్పత్తులు మార్కెట్‌కు తరలించే క్రమంలో చెక్‌పోస్టులో వసూలు చేసే ఫీజుతో కొంత ఆదాయం సమకూరుతుంది.
పకడ్బందీగా ఫీజు వసూలు
మార్కెట్ పరిధిలోని చెక్‌పోస్టు ద్వారా పకడ్బందీగా ఫీజు వసూలు చేయిస్తాం. మార్కెట్ కమిటీ చైర్మెన్, సభ్యులు, సిబ్బంది సహకారంతో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేర ఆదాయాన్ని సమకూర్చేందుకు కృషి చేస్తాం. గతేడాది లక్ష్యం కంటే ఒక శాతం ఎక్కువ ఫీజు వసూలు చేశాం.
–రవికుమార్, కార్యదర్శి
రాయికోడ్ వ్యవసాయ మార్కెట్ యార్డు