100 రోజులకు చేరిన డంప్‌యార్డ్ నిరసన
జిన్నారం(పటాన్‌చెరు): గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని డంపింగ్‌యార్డ్ ఏర్పాటును నిరసిస్తూ చేపట్టిన నిరసన దీక్షలు గురువారం 100 రోజులకు చేరాయి. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ...స్థానికంగా ఆందోళనకారులు చేపడుతున్న దీక్షలకు ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం అన్యాయమన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం దిగిరావాల న్నారు. ప్రజాపాలనలో ఇలాంటి దుస్థితి నెలకొనడంపై విచారం వ్యక్తం చేస్తున్నామన్నారు. ప్రభుత్వం డంపింగ్‌యార్డ్ ఏర్పాటు రద్దు చేస్తున్నట్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు.


