సంగారెడ్డి : జిల్లా కేంద్రం సంగారెడ్డిలో నిర్వహించిన చేనేత హస్త కళా మేళా పట్టణ ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటోంది. పట్టణంలోని టీటీడీ కల్యాణ మండపంలో ఏర్పాటు చేయగా వివిధ కాల చేనేత వస్త్రాలను అందుబాటులో ఉంచారు. పోచంపల్లి, నారాయణపేట, గద్వాల, వరంగల్, ఉప్పాడ, కంచి, ధర్మవరం, సిద్దిపేట, వెంకటగిరి చీరలు, కాటన్ చీరలు, చేనేత కాటన్, పట్టు వస్త్రాలు, డ్రెస్ మెటీరియల్స్, టవల్స్, కాటన్ ప్రింటెడ్ చీరలు, దుప్పట్లు, కర్టన్లు, భారీ మెటీరియల్స్ అందుబాటులో ఉన్నాయి. హస్త కళ వస్తువులైన కొండపల్లి, ఏటికొప్పాక, నిర్మల్ బొమ్మలు, మైసూర్ రోజ్వుడ్ వస్తువులు, వరంగల్ లెదర్స్, బంజారా ఎంబ్రాయిడరీ, హైదరాబాద్ పెరల్స్, బ్యాంగిల్స్, చెక్క వస్తువులు, బ్లాక్ మెటల్స్, పెంబర్తి, ఇత్తడి వస్తు వులు, ఖాదీ గ్రామోద్యోగ్, హెర్బల్ ఉత్పత్తులు, మైసూర్ ఆగర్భత్తి, బెంగాలీ జూట్ బ్యాగులను నిర్వాహకులు అందుబాటులో ఉంచారు. వస్తువులను కొనేందుకు మహిళలు, యువత, చిన్నారులు ఉత్సాహం చూపుతున్నారు.
భళా.. హస్త కళా మేళా
భళా.. హస్త కళా మేళా