ముగిసిన నామినేషన్ల పర్వం | Sakshi
Sakshi News home page

ముగిసిన నామినేషన్ల పర్వం

Published Sat, Nov 11 2023 4:22 AM

-

జిల్లాలో మొత్తం 175 మంది నామినేషన్లు

సంగారెడ్డి: ఈ నెల 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల ఘటం ముగిసింది. జిల్లాలో 3వ తేదీ నుంచి శుక్రవారం 10వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. 13న నామినేషన్ల పరిశీలన ,15న విత్‌ డ్రాలు, 30న ఎన్నికలు డిసెంబర్‌ 3న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. గురువారం వరకు 94 నామినేషన్లు దాఖలు కాగా, చివరి రోజైన శుక్రవారం ఒకే రోజు అత్యధికంగా 81 నామినేషన్లు దాఖలయ్యాయని ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌ తెలిపారు. అందోల్‌ నియోజక వర్గంలో 15 నామినేషన్లు, జహీరాబాద్‌లో 23, పటాన్‌చెరులో 18 నామినేషన్లు, సంగారెడ్డిలో 16, నారాయణఖేడ్‌లో 09 చొప్పున నామినేషన్లు దాఖలైనట్లు తెలిపారు. జిల్లాలోని ఐదు నియోజక వర్గాల్లో మొత్తం 175 మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు కలెక్టర్‌ వెల్లడించారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement