
రామాయంపేట పట్టణం వ్యూ
నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు
సంవత్సరం పార్టీ ఎమ్మెల్యే
1952–57 పీడీఎఫ్ ఆరుట్ల రాంచంద్రారెడ్డి
1962–67 కాంగ్రెస్ రెడ్డి రత్నమ్మ,
1967–72 కాంగ్రెస్ రెడ్డి రత్నమ్మ,
1972– 78 కాంగ్రెస్ కొండల్‌రెడ్డి
1978 –80 కాంగ్రెస్ ముత్యంరెడ్డి
1980– 85 కాంగ్రెస్ టీ.అంజయ్య
1985– 90 బీజేపీ ఆర్‌ఎస్ వాసురెడ్డి
1990–94 కాంగ్రెస్ అంతిరెడ్డిగారి విఠల్‌రెడ్డి
1994–99 టీడీపీ దేవర వాసుదేవరావు
1999–2004 కాంగ్రెస్ అంతిరెడ్డిగారి విఠల్‌రెడ్డి
2004–2008 బీఆర్‌ఎస్ పద్మాదేవెందర్‌రెడ్డి,
2008– బీఆర్‌ఎస్ మైనంపల్లి హన్మంతరావు
రామాయంపేట(మెదక్): రామాయంపేట పాత నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందిన టంగుటూరి అంజయ్య 1980లో ముఖ్యమంత్రి పదవి చేపట్టడంతో ఈ నియోజకవర్గానికి దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై న అంజయ్య 85 వరకు సీఎంగా కొనసాగారు. కాలక్రమేణా పునర్విభజనలో భాగంగా రామాయంపేట నియోజకవర్గం నుంచి రెవెన్యూ డివిజన్, మున్సిపాలిటీగా రూపాంతరం చెందింది.
వంద గ్రామాలతో తాలూకా కేంద్రంగా గుర్తింపుపొందిన రామాయంపేట 1952లోనే నియోజకవర్గంగా ఏర్పాటైంది. ఈ నియోజకవర్గంలో 1952 నుంచి 2008 వరకు 11 మంది ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. 2008లో పునర్విభజనలో నియోజకవర్గం ఎత్తివేయబడింది. గతంలో నియోజకవర్గంలో రామాయంపేట, చేగుంట, చిన్నశంకరంపేట, వెల్దుర్తి, కుల్చారం మండలాలతోపాటు మెదక్ మండలం నుంచి కొన్ని పంచాయతీలు ఉండేవి. చివరి ఎమ్మెల్యేగా 2004 నుంచి 2008 వరకు పద్మాదేవేందర్‌రెడ్డి కొనసాగారు. మధ్యంతరంగా 2008లో పార్టీ ఆదేశాలమేరకు పద్మ రాజీనామా చేయగా, తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో హన్మంతరావు ఎమ్మెల్యేగా ఎన్నికై ఏడాదిపాటు పదవిలో కొనసాగారు. మండల కేంద్రంగా కొనసాగుతున్న రామాయంపేట నుంచి విడిపోయి నిజాంపేట ప్రత్యేక మండలంగా ఏర్పాటైంది. ఐదేళ్లక్రితమే రామాయంపేట మున్సిపాలిటీగా, రెండు నెలల క్రితం రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటైంది. 1978లో ఇక్కడినుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఆర్.ముత్యంరెడ్డి పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు మధ్యలోనే రాజీనామా చేయగా, 80లో టంగుటూరి అంజయ్య ఏకగ్రీవంగా ఎన్నికై సీఎం పదవి అలంకరించారు. రామాయంపేట పాత నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నుంచి ఏడుగురు, బీఆర్‌ఎస్ నుంచి ఇద్దరు, బీజేపీ, పీడీఎఫ్ నుంచి ఒక్కొక్కరు చొప్పున ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. వీరిలో రెడ్డి రత్నమ్మ, అంతిరెడ్డిగారి విఠల్‌రెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు.
ముఖ్యమంత్రిని అందించిన
రామాయంపేట పాత నియోజకవర్గం
ప్రస్తుతం మున్సిపాలిటీ,
రెవెన్యూ డివిజన్‌గా మారిన వైనం

మాజీ ముఖ్యమంత్రి చేతులమీదుగా ప్రారంభమైన బస్టాండ్