
విద్యుదాఘాతంతో రెండు గేదెలు మృతి
కొల్చారం(నర్సాపూర్): విద్యుత్ షాక్‌కు గురై రెండు పాడి గేదెలు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన మంగళవారం మండల కేంద్రంలో కొల్చారంలో జరిగింది. వివరాలు ఇలా... బాధితుడు ఎండుగుల దుర్గయ్య తనకున్న రెండు గేదెలను మేత కోసం గ్రామ శివారులోని పెరుమాండ్లకుంట వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ మేస్తుండగా ఎల్‌టి లైన్ తెగిపడటంతో గమనించకుండా వెళ్లిన గేదెలు విద్యుదాఘాతంతో మృతి చెందాయి. గమనించిన బాధిత రైతు వెంటనే విద్యుత్ అధికారులకు సమాచారం అందించడంతో సరఫరా నిలిపివేశారు. రూ.లక్ష నష్టం జరిగిందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరాడు.