బగలాముఖీ శక్తిపీఠంలో పూజలు | - | Sakshi
Sakshi News home page

బగలాముఖీ శక్తిపీఠంలో పూజలు

Oct 1 2025 10:57 AM | Updated on Oct 1 2025 10:57 AM

బగలామ

బగలాముఖీ శక్తిపీఠంలో పూజలు

బగలాముఖీ శక్తిపీఠంలో పూజలు బస్టాండ్‌ ఎదుట నిలిచిన మురుగు? కళాశాలలో ప్రవేశానికి గడువు పెంపు అవార్డు ప్రదానం కలిసి ఉంటేనే గ్రామం అభివృద్ధి భవానీ మాత పడి పూజ

శివ్వంపేట(నర్సాపూర్‌): బగలాముఖీ శక్తిపీఠంలో మంగళవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. వేద పండితుడు శాస్త్రుల వెంకటేశ్వరశర్మ ఆధ్వర్యంలో అభిషేకం, ప్రదోష పూజ, మహా మంగళ నీరాజనం నిర్వహించారు. ఎమ్మెల్యే సునీతారెడ్డి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బగలాముఖీ వ్రత సంకల్ప పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో గ్రామ పురోహితుడు వామనశర్మ, ఆలయ భూ దాత పబ్బ రమేశ్‌ గుప్తా, నాయకులు మన్సూర్‌, యాద గౌడ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, శ్రీనివాస్‌గుప్తా, మైపాల్‌రెడ్డి, లాయక్‌, లక్ష్మణ్‌, భిక్షపతిరెడ్డి, కల్లూరి వెంకటేశ్‌, ముత్యంరెడ్డి, అశోక్‌, నర్సయ్య ఉన్నారు.

హవేళిఘణాపూర్‌(మెదక్‌): మండల కేంద్రమైన హవేళిఘణాపూర్‌లో చేపట్టిన హైవే రోడ్డు పనుల కారణంగా బస్టాండ్‌ ఆవరణలో గుంత ఏర్పడి మురుగునీరు నిలిచింది. దీంతో బస్టాండ్‌లోకి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా మురుగునీటి నుంచి దుర్వాసన వస్తుందని, దోమలు వృద్ధి చెందే అవకాశముందని స్థానికులు వాపోతున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి బస్టాండ్‌ ఆవరణలో నిలిచిన మురుగునీటిని తొలగించాలని కోరుతున్నారు.

నర్సాపూర్‌ రూరల్‌: అంబేద్కర్‌ ఓపెన్‌ డిగ్రీ కళాశాల ప్రవేశానికి అక్టోబర్‌ 10వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కే.హుస్సేన్‌, కోఆర్డినేటర్‌ హేమంత్‌ కుమార్‌ తెలిపారు. ఓపెన్‌ ఇంటర్‌ పాసైన విద్యార్థులతో పాటు రెగ్యులర్‌ ఇంటర్‌, పాలిటెక్నిక్‌, ఐటీఐ, రెండేళ్ల డిప్లమా కోర్సుల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ప్రవేశానికి అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

దుబ్బాక: పట్టణ పరిధిలోని ధర్మాజీపేట జెడ్పీహెచ్‌ఎస్‌ హెచ్‌ఎం సాదత్‌అలీ ఇన్నోవేటీవ్‌ టీచర్‌ అవార్డు అందుకున్నారు. హైదరాబాద్‌ హరిహర కళాభవన్‌లో జటాధర ఎడ్యుకేషనల్‌ టెక్నాలజీ(జెట్‌) సంస్థ ఆధ్వర్యంలో అందజేశారు. వింగ్‌ కమాండర్‌ ఆంటోని చేతుల మీదుగా ఆయన అవార్డు, నగదు పురస్కారం అందుకున్నారు. కాగా సింపుల్‌ టాస్క్‌ గ్రేట్‌ కాన్సెప్ట్‌ ప్రయోగాలతో విద్యార్థుల్లో సైన్స్‌ పట్ల అభిరుచిని పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు. ప్రయోగాత్మక బోధనను అందిస్తున్న సాదత్‌అలీ కృషిని గుర్తించి ఇన్నోవేటీవ్‌ అవార్డును ప్రదానం చేశారు.

టేక్మాల్‌(మెదక్‌): గ్రామాల్లోని ప్రజలందరూ కలిసి ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఎస్‌ఐ రాజేశ్‌ తెలిపారు. మంగళవారం మండలంలోని కోరంపల్లి గ్రామంలో ఆర్‌ఐ సాయిశ్రీకాంత్‌తో కలిసి మానవహక్కుల దినోత్సవంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గ్రామాల్లో రెండు గ్లాసుల పద్ధతిని పాటించరాదన్నారు. కుల,మతాలు, తారతమ్యం లేకుండా, అన్నదమ్ముల వలే కలిసి ఉండాలని సూచించారు. అందరికి ఆదర్శంగా ఉంటూ ఎటువంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో నాయకులు మల్లారెడ్డి, హన్మంతు తదితరులు ఉన్నారు.

కల్హేర్‌(నారాయణఖేడ్‌): నిజాంపేట మండలంలోని భక్తిధాం(బల్కంచెల్క) తండాలో మంగళవారం రాత్రి భవానీ మాత పడి పూజ వైభవంగా నిర్వహించారు. మందిరం ధర్మకర్త, మహబూబ్‌ నగర్‌ జిల్లా రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్‌ కిషన్‌సింగ్‌–లలిత దంపతుల ఆధ్వర్యంలో తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కొండాపూర్‌ ఆశ్రమ పీఠాధిపతి సంగ్రామ్‌ మహరాజ్‌ ప్రవచనం చేశారు. ఎంఈఓ రాములు, శంకర్‌, ఖట్రోత్‌ జైల్‌సింగ్‌, రాములు, రూప్‌సింగ్‌, కిషన్‌, సవాయ్‌సింగ్‌, మన్మోహన్‌ పాల్గొన్నారు.

బగలాముఖీ శక్తిపీఠంలో పూజలు 
1
1/3

బగలాముఖీ శక్తిపీఠంలో పూజలు

బగలాముఖీ శక్తిపీఠంలో పూజలు 
2
2/3

బగలాముఖీ శక్తిపీఠంలో పూజలు

బగలాముఖీ శక్తిపీఠంలో పూజలు 
3
3/3

బగలాముఖీ శక్తిపీఠంలో పూజలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement