
రైతు బిడ్డకు డీఎస్పీ ఉద్యోగం
నారాయణఖేడ్: నిరుపేద కుటుంబంలో జన్మించిన రైతు కుమారుడు డీఎస్పీ ఉద్యోగం సాధించాడు. మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన కుమ్మరి శివరామనందన్‌గ్రూప్–1 ఫలితాల్లో ర్యాంకు సాధించి సత్తా చాటాడు. కుమ్మరి నర్సింహులు, మల్లమ్మలకు ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులు. వీరికి నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉండటంతో వ్యవసాయం చేసుకుంటూ పిల్లలను పోషించారు. చిన్న కుమారుడు శివరామనందన్‌ప్రాథమిక విద్యాభ్యాసం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువగా, 7వ తరగతి వరకు హన్మత్‌రావుపేటలో, 10వ తరగతి లింగంపల్లి గురుకులంలో చదివాడు. ఇంటర్మీడియెట్ శ్రీతేజ కళాశాలలో ఉచితంగా సీటు ఇవ్వడంతో పూర్తి చేశాడు. సేయింట్ ఆంటోనీస్‌లో డిగ్రీ పూర్తి చేసి, ఉస్మానియాలో ఎమ్మెస్సీ పూర్తి చేసి నాలుగేళ్ల క్రితం కస్టమ్స్ ఇన్‌న్‌స్పెక్టర్‌గా ఉద్యోగం పొందినప్పటికీ చైన్నెలో విధులు నిర్వహించాల్సి రావడంతో ఆగిపోయాడు. గ్రూప్–1 పరీక్షలు రాసి డీఎస్పీ ఉద్యోగాన్ని దక్కించుకున్నాడు.