
చిన్నారిని చిదిమేసిన ట్రాలీ
సిద్దిపేట జిల్లాలో ఘటన
ములుగు(గజ్వేల్): రోడ్డు ప్రమాదంలో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన మండలంలోని తున్కిబొల్లారంలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ విజయ్‌కుమార్ కథనం ప్రకారం... గ్రామానికి చెందిన బక్కస్వామి నర్సింలు, సుప్రియ దంపతులకు చైత్ర, శ్రీనిధి, మనుశ్రీ ముగ్గురు కుమార్తెలు సంతానం. కాగా చిన్న కూతురు మనుశ్రీ(17 నెలలు ) ఇంటి ముందు ఆడుకుంటుంది. ఈ క్రమంలో గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసుకుంటూ అటువైపు వస్తున్న ట్రాలీ వాహనం డ్రైవర్ అజాగ్రత్త కారణంగా చిన్నారిని ఢీకొట్టాడు. దీంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందింది. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
ముగ్గురికి గాయాలు
జగదేవ్‌పూర్(గజ్వేల్): రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని మునిగడప సమీపంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... మర్కూక్ మండలం పాములపర్తి వద్ద పేడ లోడ్‌తో కొడకండ్ల వైపు వెళుతున్న డీసీఎంను సిరిసిల్ల నుంచి బట్టల లోడ్‌తో వస్తున్న డీసీఎం ఢీకొట్టింది. దీంతో డ్రైవర్ మల్లేశం, లక్ష్మారెడ్డితో పాటు మరొకరికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం గజ్వేల్‌కు తరలించారు.